CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో గుడ్ న్యూస్…

CoronaVirus Vaccine: కోవాక్సిన్ కూడా ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తే.. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 5, 2020, 4:16 PM IST
CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో గుడ్ న్యూస్…
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయెటెక్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్టు ఒకరు వెల్లడించారు. ఊహించిన సమయానికి కంటే ముందే కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. కోవాక్సిన్‌ చివరి దశ ట్రయల్స్ దాదాపు 25 వేలమందితో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. ఐసీఎంఆర్, ఎన్‌ఐవీతో కలిసి రూపొందిస్తున్న కోవాక్సిన్‌ను 2021 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుందని ఐసీఎంఆర్ రీస‌ర్చ్ మేనేజ్మెంట్‌ హెడ్‌, సీనియర్ శాస్త్రవేత్త, కరోనా వైరస్ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యుడు రజనీకాంత్ తెలిపారు.

మొదటి, రెండవ దశ ప్రయోగాల్లో టీకా మంచి సామర్థ్యాన్ని చూపించిందని అన్నారు. అయితే మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలు వస్తే ఈ వ్యాక్సిన్ కచ్చితత్వాన్ని నిర్ధారించలేమని అన్నారు. మూడో దశ ట్రయల్స్ ముగిసేలోపు కోవాక్సిన్‌ షాట్లను ప్రజలకు ఇవ్వొచ్చో లేదో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ విషయాన్ని భారత్ బయోటెక్ సంస్థ ఇంకా ధృవీకరించలేదు.

మరోవైపు జనవరి, 2021నాటికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ అందుబాటులో రానుందని పుణేకు చెందిన సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. తాజాగా కోవాక్సిన్ కూడా ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తే.. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని ప్రజలకు అందించాలని కేంద్రం చర్యలు చేపట్టింది.
Published by: Kishore Akkaladevi
First published: November 5, 2020, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading