Corona virus: మరోసారి కరోనా కలకలం.. వైద్య కళాశాలలో ఒకేసారి 29 మంది విద్యార్ధులకు పాజిటివ్..

ప్రతీకాత్మకచిత్రం

Corona Virus: కరోనా మహమ్మరి మళ్లీ విరుచుకుపడుతోంది. తగ్గినట్టే తగ్గి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులను వైరస్ వెంటాడుతోంది. తాజాగా ఒకే వైద్య కళాశాలలో 29 మందికి వైరస్ సోకడం కలవరపెడుతోంది.. దీంతో అన్ లాక్ పై మళ్లీ ఆలోచించే పరిస్థితి నెలకొంది

 • Share this:
  Corona cases in Medical College: కరోనా సెకెండ్ వేవ్ (Corona Second Wave) ఇంకా వెంటాడుతూనే ఉంది. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు (Third wave Alert) భయపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతూ వస్తోంది పలు రాష్ట్రాల్లో. ఇక మహారాష్ట్ర (Maharastra) దాదాపు పూర్తిగా అన్‌లాక్ (Unlock)అయింది. త్వరలో పాఠశాలలు (Schools) కూడా మొత్తం రాష్ట్రంలో ఆంక్షలతో ప్రారంభమవుతాయి. పరిస్థితి మామూలుగా అవుతుంది అనుకున్న సమయంలో మరోసారి ముంబై (Mumbai) నుండి భయపట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. కేఈఎం ఆసుపత్రిలో ఏకంగా 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వ్యాధి సోకిన విద్యార్థులలో, 27 మంది రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నవారే అవ్వడం ఇంకాస్త ఆందోళన పెంచుతోంది. అంటే వ్యాక్సిన్ వేసుకున్నా సురక్షితం కాదా అనే సంకేతాలు అందిస్తోంది.

  ఈ 29 మందిలో 7 గురు విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా, మిగిలిన 23 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు. కరోనా సోకిన వారిలో ఇద్దరు ముంబైలోని సెవెన్ హిల్ ఆసుపత్రిలో చేరారు. మిగతా అందరి పరిస్థితి నిలకడగా ఉంది. వారు క్వారంటైన్ లో ఉన్నారు.

  ఇదీ చదవండి: వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోతోందా..? నివారణ కోసం ఏం చేయాలి?

  కొన్ని రోజుల క్రితం కళాశాలలో జరిగిన సాంస్కృతిక, క్రీడా కార్యక్రమం కారణంగానే వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వైద్య విద్యార్థులందరూ ఒకరికొకరు పరిచయమై కరోనా పాజిటివ్‌గా మారారని మేయర్ కిశోరి పెద్నేకర్ ప్రకటించారు. ముంబైలోని కేఈఎం హాస్పిటల్ నగరంలో అతి పెద్ద ఆసుపత్రి. కానీ మహారాష్ట్రలో కరోనా విస్తరణ నేపథ్యంలో.. దీన్ని కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో, చాలా మందికి కలిసి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించిరపన తర్వాత, ఆసుపత్రి పరిపాలన మరింత మంది వైద్యులను పరీక్షిస్తున్నారు. ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  ఇదీ చదవండి: కోడిగుడ్ల రోల్.. 20 నిమిషాల్లో తింటే 20 వేల బహుమతి.. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి

  మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, గత 24 గంటల్లో రాష్ట్రంలో 3 వేల మందికి కరోనా పాజిటివ్ గా మారారు. రాష్ట్రంలో 187 మంది కొత్త కరోనా రోగులు నిర్ధారించబడ్డారు. 49 మంది రోగులు మరణించారు. 3187 కొత్త కేసులతో, రాష్ట్రంలో మొత్తం సోకిన రోగుల సంఖ్య ఇప్పుడు 65 లక్షల 47 వేల 793 కి పెరిగింది. అదే సమయంలో, ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1 లక్షా 39 వేల 11 కి పెరిగింది.

  కరోనా డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 138 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రంలోని పోలీసు అధికారులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ .138 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. నాగపూర్ నివాసి అయిన సంజయ్ ధూలే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTE) కింద ఈ సమాచారాన్ని పొందారు.

  ధూలే మహారాష్ట్ర పోలీసుల నుండి కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం గురించి వివరాలు కోరాడు. ప్రతిస్పందనగా, 277 రాష్ట్ర పోలీసు అధికారుల కుటుంబాలకు రూ .138.50 కోట్లు, 106 ముంబై పోలీసు అధికారులు, ఉద్యోగుల కుటుంబాలకు 53 కోట్లు ఆమోదించబడినట్లు ప్రభుత్వం తెలిపింది.
  Published by:Nagesh Paina
  First published: