దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు... అదే ఊరట..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల రేటు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

news18-telugu
Updated: May 26, 2020, 5:05 PM IST
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు... అదే ఊరట..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ మినహాయింపు తరువాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 7,000కు చేరువవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,000 దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ సామర్ధ్యం పెరిగిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. రోజుకు 1.1 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించింది. 612 ల్యాబ్‌ల్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల రేటు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్‌-19 మరణాల రేటు 3.3 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉందని అన్నారు. దేశంలో మహమ్మారి బారినపడి కోలుకునే వారిసంఖ్య 60,000 దాటడంతో రికవరీ రేటు 41.61 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ రేటు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు.