షాకింగ్... ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న కరోనా పేషెంట్ మృతి

ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందిన బాధితుడు... మొదట కరోనా నుంచి కోలుకున్నట్టు కనిపించాడు.

news18-telugu
Updated: May 1, 2020, 1:34 PM IST
షాకింగ్... ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న కరోనా పేషెంట్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌ చికిత్సకు ఆశాకిరణంగా కనిపించిన ప్లాస్మా థెరపీ వికటించి ఓ బాధితుడు(54) చనిపోయాడు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందిన బాధితుడు... మొదట కరోనా నుంచి కోలుకున్నట్టు కనిపించాడు. అయితే ప్లాస్మా థెరపీ మొదలుపెట్టిన 24 గంటల తరువాత అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించడం మొదలైంది. దీంతో డాక్టర్లు అతడికి వెంటిలేటర్ అమర్చారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స తీసుకుంటున్న రోగి కోలుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించిన కొద్ది గంటల్లోనే బాధితుడు చనిపోయాడు.

అంతకుముందు ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పలువురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్లాస్మా థెరపీ అనేది ఇంకా పూర్తిస్థాయిలో కరోనాను నయం చేసే థెరపీ కాదని కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగం దశలోనే ఉందని... ప్రస్తుతం ఐసీఎంఆర్ దీనిపై అధ్యయనం చేస్తోందని వివరించింది. దీన్ని ఐసీఎంఆర్ ఆమోదించేవరకు ఎవరూ ఈ చికిత్సను అమలు చేయకూడదని స్పష్టం చేసింది. ఇది రోగులకు ప్రమాదకరంతో పాటు చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.
First published: May 1, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading