Corona Alert: కరోనా రెండోసారి రావొద్దని దేవుడ్ని వేడుకోవాలి.. రెండోసారి వచ్చిందంటే..

ఇప్పటి వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే.. కోవిడ్-19 నుంచి కోలుకున్న 74 రోజుల తరువాత రెండోసారి వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 23, 2020, 4:22 PM IST
Corona Alert: కరోనా రెండోసారి రావొద్దని దేవుడ్ని వేడుకోవాలి.. రెండోసారి వచ్చిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్-19 మహమ్మారి భయాలు ప్రజల్లో ఇంకా పోలేదు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి, మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఒకసారి కరోనా సోకిన వారికి రెండో సారి వైరస్ సోకితే ప్రాణాలకు మరింత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్నవారికి మళ్లీ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. ఇటీవల రెండోసారి COVID-19 సోకి ఒక డచ్ మహిళ మరణించిన సంఘటన తరువాత దీనిపై మళ్లీ భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండో సారి కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య (అక్టోబర్ 16 వరకు) 24కు చేరుకుంది. మొట్టమొదటి రీ ఇన్‌ఫెక్షన్ కోవిడ్ -19 కేసు ఆగస్టులో నమోదైంది. మార్చిలో కరోనా సోకిన 33 ఏళ్ల వ్యక్తికి మరోసారి ఆగస్టులో SARS-CoV-2 సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కారణాలేంటి?

సాధారణంగా ఎవరికైనా వైరస్ సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. వైరస్ సంక్రమణను, కణాల ఉత్పత్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే యాంటీ బాడీస్‌ను శరీరం అభివృద్ధి చేసుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వైరస్‌ సోకి కోలుకున్న తరువాత మళ్లీ అది వ్యాపించే అవకాశం ఉంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. వైరస్ మ్యుటేషన్, శరీరం యాంటీబాడీస్‌ను తగినంత ఉత్పత్తి చేయకపోవడం, రోగనిరోధక శక్తి క్షీణించడం, రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన సరిగ్గా లేకపోవడం... వంటి వివిధ కారణాల వల్ల వైరస్ రెండోసారి సంక్రమించవచ్చు. తేలికపాటి కోవిడ్-19 లక్షణాలతో వైరస్ సోకిన వారిలో, శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలు వేగంగా తగ్గిపోతాయని పరిశోధనలు వెల్లడించాయి.

ప్రమాదం తీవ్రత ఎక్కువ
ఎంతకాలం తర్వాత ఒక వ్యక్తికి రెండోసారి COVID-19 సంక్రమించగలదనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే.. కోవిడ్-19 నుంచి కోలుకున్న 74 రోజుల తరువాత రెండోసారి వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి మహమ్మారి బారిన పడిన వారిలో వ్యాధి లక్షణాలు మొదటిసారికంటే తీవ్రంగా మారుతాయి. రెండోసారి కోవిడ్ సోకిన వారిలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రీ ఇన్‌ఫెక్షన్ మరింత ప్రమాదకరంగా మారుతోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 23, 2020, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading