CoronaVirus: ఆ ప్రాంతాల వారికి కరోనా ముప్పు ఎక్కువ.. అధ్యయంలో వెల్లడి

అమెరికాలో నమోదైన కరోనా కేసులపై డేటాను సేకరించి దానిపై విశ్లేషణ చేసింది. ఈ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.

news18-telugu
Updated: November 6, 2020, 3:20 PM IST
CoronaVirus: ఆ ప్రాంతాల వారికి కరోనా ముప్పు ఎక్కువ.. అధ్యయంలో వెల్లడి
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టాయన్న భ్రమలో అనేక దేశాలు లాక్డౌన్ ఎత్తేశాయి. దీంతో కేసులు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా సెకండ్ వేవవ్ ప్రారంభమవుతుందని యోచిస్తున్న అనేక దేశాలు మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలను విశ్లేషించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ.

అమెరికాలో నమోదైన కరోనా కేసులపై డేటాను సేకరించి దానిపై విశ్లేషణ చేసింది. ఈ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. దీనిలో తేలిన దాని ప్రకారం, అధిక స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు కోవిడ్–-19 బారిన పడి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. కాలుష్యం తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలతో పోలిస్తే 11 శాతం మంది ఎక్కువ మంది కాలుష్య ప్రాంతాల్లో కోవిడ్ బారీన పడి చనిపోయే అవకాశం ఉందని రిసెర్చ్ పేర్కొంది. దీనికి గాను గాలిలో 2.5 మైక్రోమీటర్ల కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. 2.5 పిఎం కాలుష్యం కంటే ప్రతి క్యూబిక్ మీటర్కు గాలిలో పెరిగే ఒక మైక్రోగ్రామ్ కాలుష్యం కరోనా వైరస్తో మరణించే అవకాశాలను11 శాతం మేర పెంచుతుందని పరిశోధకులు గమనించారు.

98 శాతం అమెరికన్ల నుంచి సేకరించిన డేటా..
కాగా, హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఈ పరిశోధనకు గాను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుండి డేటా తీసుకోబడింది. అయితే, పొల్యూషన్ డేటాను మాత్రం కంప్యూటర్ మోడల్స్, వాతావరణ డేటా సహాయంతో సేకరించారు. మొత్తం 98 శాతం అమెరికన్లకు సంబంధించిందిన ఈ డేటాను 3,089 కౌంటీల నుండి సేకరించారు. అయితే, సాధారణంగా అమెరికాలో కాలుష్య హాట్‌స్పాట్‌లు మారుతుంటాయి. అమెరికాలోని కొన్ని నగరాల్లో అసలు కాలుష్య హాట్స్పాట్స్ ఉండవు. మరికొన్న ప్రధాన నగరాలు క్యూబిక్ మీటరుకు 12 మైక్రోగ్రాముల కాలుష్య స్థాయిని కలిగి ఉన్నాయి.

అయితే, కాలుష్యానికి, కరోనా వైరస్‌కు సంబంధం ఏంటనే సందేహం రావొచ్చు. దీనికి గల కారణాన్ని కూడా పేర్కొంది హార్వార్డ్ యూనివర్సిటీ స్టడీ. సాధారణంగా కరోనా వైరస్ మానవ కణాలలో కనిపించే అల్వియోలార్ యాంజియోటెన్సిన్ -కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ACE-2) రిసెప్టార్లను బంధిస్తుంది. ఇది ఆయా కణాలను తెరవడానికి రిసెప్టార్లను ఉపయోగించుకుంటుంది. తద్వారా, మానవ శరీర రక్షణ వ్యవస్థలోకి కరోనాకు మూలమైన ACE-2 ఎంజైమ్ చొరబడుతుంది. తద్వారా కాలుష్య ప్రాంతాల్లో నివసించే వారిలో కోవిడ్–-19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: November 6, 2020, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading