Corona Lockdown | విశాఖ జిల్లాలో రేపటి నుంచి మారిన రూల్స్ ఇవే...

కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో ప్రజలకు మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి 9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి ఉంటుంది.

news18-telugu
Updated: March 25, 2020, 10:59 PM IST
Corona Lockdown | విశాఖ జిల్లాలో రేపటి నుంచి మారిన రూల్స్ ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో ప్రజలకు మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి 9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి ఉంటుంది. పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, మార్కెట్ కి మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి. ఉదయం 4 నుంచి 8 వరుకు మిల్స్ & డైరీ ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి ఉంటుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు టేక్ ఎవే హోటల్స్ కు అనుమతి ఉంటుంది. ప్రభుత్వ, పోలీస్, ఫైర్, విద్యుత్, రెవిన్యూ , వీఎంసీ, మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఇస్తారు. జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు. పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విశాఖ జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు