Coronavirus: మాస్క్ ధరించకుంటే రూ.2వేలు ఫైన్.. మళ్లీ కఠిన ఆంక్షలు..

నిన్న ఒక్కరోజే దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. బుధవారం 131 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు.

news18-telugu
Updated: November 19, 2020, 2:55 PM IST
Coronavirus: మాస్క్ ధరించకుంటే రూ.2వేలు ఫైన్.. మళ్లీ కఠిన ఆంక్షలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో ప్రజలు కరోనా వైరస్‌ను మర్చిపోయారు. అదొక మహమ్మారన్న విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరగడం, మరణాలు రేటు తక్కువగా ఉండడంతో.. కరోనాకు ఎవరూ భయపడడం లేదు. వచ్చినా తగ్గిపోతుంది..ప్రాణాపాయం ఉండదనే ధీమాతో.. లైట్ తీసుకుంటున్నారు. రోడ్లపై జనాలు గుంపులు గంపులుగా కనిపిస్తున్నారు. చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. ఐతే శీతాకాలంలో సెకండ్ విజృంభిస్తుని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరణాలు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలను విధిస్తోంది.

ఢిల్లీలో చాలా మంది మాస్క్ ధరించకపోవడాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న రూ.500గా ఉన్న జరిమానాను..రూ.2వేలకు పెంచారు. మాస్క్ ధరించకుండా ఎవరైనా బయట కనిపిస్తే వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.


కాగా, కొద్దిరోజులుగా ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. బుధవారం 131 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ కొత్తగా 7486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 5 లక్షలు దాటాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో నిన్న 62 వేల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12.03 శాతం మందికి పాజిటివ్ వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 5,03,084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 42,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం 7943 మంది బాధితులు మరణించారు. కరోనా విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వద్దని.. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరంగా పాటించాలని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading