కర్ణాటకలో కరోనా ఉధృతి.. భారీగా పెరిగిన కేసులు

కర్ణాటకలో ఇవాళ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: August 4, 2020, 10:19 PM IST
కర్ణాటకలో కరోనా ఉధృతి.. భారీగా పెరిగిన కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలోని కొన్ని రాష్ట్రాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే... మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా చేరిపోయింది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ కొత్తగా 6,259 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఒకేరోజు ఇన్ని పాజిటివ్ కేసులు రావడం ఇదే తొలిసారి. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,45,830కి పెరిగినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో మరో 110 మంది ఈ మహమ్మారికి బలికావడంతో... మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704కి చేరింది.

మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవాళ 6,777 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 69,272కి చేరింది. ప్రస్తుతం 73,846 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 73,212 పరిస్థితి నిలకడగా ఉండగా.. 634 మంది ఐసీయూల్లో చికిత్స పొందున్నట్టు తెలిపారు. మరోవైపు కరోనా బారిన పడ్డ కర్ణాటక సీఎం యడియూరప్ప పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: August 4, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading