తమిళనాడులో కరోనా ఉగ్రరూపం.. 1000 దాటిన మరణాలు..

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3713 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

news18-telugu
Updated: June 27, 2020, 7:09 PM IST
తమిళనాడులో కరోనా ఉగ్రరూపం.. 1000 దాటిన మరణాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న తమిళనాడు... ఢిల్లీని మించిపోయి రెండో స్థానానికి చేరుకునేలా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3713 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 78335కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 63 మంది చనిపోయారు. వీటితో కలుపుకుని తమిళనాడులో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1025కు చేరుకుంది.

మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉంటుంది. ఇవాళ కొత్తగా 2737 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 44094గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33213 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నెలో కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది.

First published: June 27, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading