Coronavirus Karnataka: కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే..

Coronavirus Karnataka Updates | కరోనా నుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయం దుమారం రేపాయి.

news18-telugu
Updated: July 16, 2020, 8:09 PM IST
Coronavirus Karnataka: కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Coronavirus Karnataka:కర్ణాటకలో కరోనా మహమ్మారి అంతకంతకూ పంజా విసురుతోంది. కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో... బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ణాటక సర్కార్ లాక్‌డౌన్ కూడా విధించింది. అయినా రాష్ట్రంలో కోవిడ్ 19 కేసులు తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 4169 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 51422కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే కొత్తగా 104 మంది వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1032కు చేరింది. బెంగళూరులో ఒక్క రోజు వ్యవధిలోనే 2344 కొత్త కేసులు వెలుగు చూడగా... 70 మంది కన్నుమూశారు.

మరోవైపు కరోనా నుంచి దేవుడే కాపాడాలంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయం దుమారం రేపాయి. మరో రెండు మాసాల పాటు కరోనా కేసులు పెరిగే అవకాశం 100శాతం ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం, మంత్రుల నిర్లక్ష్యమేదీ లేదని..ప్రస్తుత కరోనా సంక్షోభం నుంచి దేవుడే రాష్ట్రాన్ని కాపాడాలని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు వ్యాఖ్యలను బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు మండిపడ్డాయి. కరోనా విషయంలో చేతులు దులుపుకున్న బీజేపీ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయిందంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ధ్వజమెత్తారు. సీఎం యడ్యూరప్ప, మంత్రివర్గ సహచరులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని శ్రీరాములు వివరణ ఇచ్చారు.
Published by: Kishore Akkaladevi
First published: July 16, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading