CoronaVirus: తెలంగాణలో కరోనా కలకలం...కొత్తగా 2511 పాజిటివ్ కేసులు నమోదు...

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,511 కొత్తగా కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

news18-telugu
Updated: September 5, 2020, 10:05 AM IST
CoronaVirus: తెలంగాణలో కరోనా కలకలం...కొత్తగా 2511 పాజిటివ్ కేసులు నమోదు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి 2 వేలపైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,511 కొత్తగా కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కోవిడ్ కారణంగా 11 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,395కి చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 877కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,579 మంది రికవరీ అయినట్టు బులిటెన్ లో పేర్కొంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరిలో 25,729 మంది హోం క్వారంటైన్‌, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. ఇక, మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.73 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.63 శాతంగా ఉంది. రికవరీ కేసుల సంఖ్య 75.5 శాతానికి పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా జాతీయ స్థాయిలో కేసుల సంఖ్య 77 శాతంగా ఉంది.

జిల్లా వారీగా చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 305 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 184, నల్గొండలో 170, కరీంనగర్ లో 150, ఖమ్మంలో 142 కేసులు నమోదు అయ్యాయి.
Published by: Krishna Adithya
First published: September 5, 2020, 10:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading