Corona Vaccine : మనల్ని ఒక్కటి చేస్తున్న వ్యాక్సిన్‌లు... అంతర్జాతీయ కోణం..

Corona Vaccine : మనల్ని ఒక్కటి చేస్తున్న వ్యాక్సిన్‌లు... అంతర్జాతీయ కోణం..

Corona Vaccine : గ్లోబల్ వాక్సినేషన్ కోఆర్డినేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ తమ తమ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ల సామర్థ్యం గురించి రియల్-టైమ్ డేటాను పంచుకుంటూ, ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవడం.

 • Share this:
  బ్రెజిల్, భారతదేశాలు ప్రపంచానికి చెరొక మూలన ఉంటాయి. చారిత్రాత్మకంగా చూస్తే, ఈ రెండు దేశాలు వాణిజ్యపరంగా, ప్రజల సంబంధాలపరంగా కొంత బంధాన్ని కలిగి ఉన్నాయి. కనుక, ఈ ఏడాది ప్రారంభంలో 2 మిలియన్ డోస్‌ల కోవిషీల్డ్ వాక్సిన్లు అందిన తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో, భారత ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ ‘ధన్యవాద్’ అని ట్వీట్ చేశారు. Covid-19 మీద ప్రపంచ దేశాలు ప్రకటించిన యుద్ధంలో ఇలా ఒక దేశం మరో దేశానికి సహాయం చేయడం అంతర్జాతీయ సహకారంలో కొత్త శకానికి నాంది పలికింది. పాండమిక్ కారణంగా ఆయా దేశాలు తమ స్వంత సమస్యలతో బాధ పడుతున్నా అంతర్జాతీయంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధపడ్డారు.

  పాండమిక్ సమయంలో వైరస్‌తో పోరాడటానికి తెలివితేటలు, అనుభవాన్ని పంచుకోవాలనే నిజాన్ని ఈ అంతర్జాతీయ సహకారంలో దేశాలు అర్థం చేసుకున్నాయి. సరిహద్దులు మూత పడినప్పటికీ, సహాకారంలో మాత్రం దేశాలు ఒక్కటయ్యాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ విషయంలో ఈ సహకారం పెరిగింది. ఇప్పుడు, ఈ సహకారాలను మార్గదర్శకం చేసే WHO, సెంటర్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ (CEPI), గావి వ్యాక్సిన్ అలియన్స్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానంగా వ్యాక్సిన్ అందేలా ఈ సంస్థలు పాలసీలను రూపొందిస్తున్నాయి.

  ఈ మిషన్ విజయవంతంగా పూర్తి చేయడంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. సరుకులు అందరికీ సమంగా అందజేయడంలో సమస్యలు, సరుకుల రవాణాలో సెక్యూరిటీ సమస్యలు, స్థానిక సమస్యలు, అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల అనుకూలత సమస్యలను పరిగణలోకి తీసుకుని సంస్థలు ప్రణాళికలను రచించాలి. ఈ సమస్యలన్నీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను ప్రభావితం చేస్తాయి. కానీ సమస్యలు ఉన్న చోటే అవకాశాలు కూడా ఉంటాయి. గ్లోబల్ వాక్సినేషన్ కోఆర్డినేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ తమ తమ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ల సామర్థ్యం గురించి రియల్-టైమ్ డేటాను పంచుకుంటూ, ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవడం. ధనవంతమైన దేశాలు వ్యాక్సిన్ స్టాక్ పెట్టుకోకుండా నియంత్రించడానికి COVID-19 వ్యాక్సిన్స్ గ్లోబల్ యాక్సెస్ గ్రూప్ (COVAX) లాంటి అంతర్జాతీయ విధాన సంస్థలు ఉన్నాయి. అదనంగా ఉన్న వ్యాక్సిన్లను పేద దేశాలకు దానం చేసేలా ఈ సంస్థలు ప్రచారాలు నిర్వహిస్తాయి.

  ఇలా అంతర్జాతీయంగా దేశాలు సహకరించుకోవడం వలన వ్యాక్సిన్ పంపిణీ సమానంగా జరిగే ప్రయోజనం ఉంటుంది. పేద దేశాలకు ధనిక దేశాలు వ్యాక్సిన్ డొనేట్ చేయడం వల్ల అయ్యే ఖర్చులు, పాండమిక్ తగ్గిపోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థలు త్వరగా కోలుకున్నాక పెట్టుబడికి తగిన లాభాన్ని కూడా తీసుకువస్తాయి. ఈ క్రమంలో ఏర్పడిన కొత్త సంబంధాలు, బలపడిన పాత సంబంధాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి క్లిష్టపరిస్థితులు వచ్చినా కూడా ఒకరికొకరు సాయం చేసుకుని, ప్రపంచమంతా ఏకమై పోరాడే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రజల ప్రవర్తనావళి చూసినా కూడా ఈ సమయంలో తమ తమ అనుభవాలను సరిపోల్చుకుని, ఇరువురి మధ్యలో ఉన్న భేదాలను, వ్యత్యాసాలను పోగొట్టుకుని కలిసిపోయే అవకాశం ఉంటుంది.

  కొవిడ్-19 బారిన పడి, సరైన సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడే వెనకబడిన తరగతుల వారికి ఈ అంతర్జాతీయ సహకారంలో కొత్త శకం వల్ల కనిపించని లాభం కలుగుతోంది. Federal Bank వారి ప్రత్యేకమైన CSR ఇనిషియేటివ్ అయిన Network18 వారి ‘Sanjeevani – A Shot of Life (సంజీవని – ఎ షాట్ ఆఫ్ లైఫ్)’ దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ దీని ఆదర్శంగా ఏర్పడినదే. ఈ డ్రైవ్‌లో చేరి భారతదేశ వ్యాధినిరోధక శక్తిని పెంచి, కొవిడ్-19 వ్యాక్సినేషన్ అందించడంలో సహాయం చేయండి. దీని గురించి సమాచారాన్ని ప్రతి భారతీయునికి తెలియజేయండి. ప్రపంచాన్ని ఆరోగ్యంగా మార్చడానికి మనకు వచ్చిన అవకాశం ఇది.
  Published by:Sridhar Reddy
  First published: