Corona Vaccine: గుడ్‌న్యూస్.. ఈ క‌రోనా టీకాను నెల‌ రోజులు ఫ్రిజ్‌లో ఉంచుకోవ‌చ్చు..

ప్రతీకాత్మక చిత్రం

తెర‌వ‌కుండా ఉన్న వ్యాక్సిన్ సీసాలను 2-8 డిగ్రీ సెల్సియ‌స్ (35-46 ఫారెన్ హీట్) వ‌ద్ద‌.. అంటే డీప్ ఫ్రిజ్ కండీష‌న్ నుంచి బ‌య‌ట‌కు తీసిన త‌ర్వాత సాధార‌ణ ఫ్రిజ్‌లో ఐదు రోజుల నుంచి నెల రోజులు (31 రోజులు) ఉంచొచ్చ‌ని ఆమ్‌స్ట‌ర్‌డామ్‌కు చెందిన యురోపియ‌న్ మెడిసిన్ ఏజెన్సీ చెప్పింది.

  • Share this:
కరోనాపై పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఫైజ‌ర్ (Pfizer) క‌రోనా టీకా అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది. చాలా దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఐతే ఫైజర్ టీకాపై యూరోపియన్ యూనియన్ డ్రగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ఫైజ‌ర్ బ‌యోఎన్‌టెక్ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ (Corona Virus Vaccine)ను నెల రోజుల వ‌ర‌కూ ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవ‌డానికి యురోపియ‌న్ యూనియ‌న్‌ (European Union)కు చెందిన డ్ర‌గ్ ఏజెన్సీ సోమ‌వారం అమోదం తెలియ‌జేసింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను సూప‌ర్‌-కూల్డ్ ఫ్రీజ‌ర్‌లో ఐదు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చని మొదట్లో చెప్పారు. ఇప్పుడు సాధారణ ప్రిజ్లో కూడా నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవ‌చ్చ‌ని యురోపియ‌న్ మెడిసిన్ ఏజెన్సీ వెల్ల‌డించింది. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈ టీకా వాడ‌కం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

తెర‌వ‌కుండా ఉన్న వ్యాక్సిన్ సీసాలను 2-8 డిగ్రీ సెల్సియ‌స్ (35-46 ఫారెన్ హీట్) వ‌ద్ద‌.. అంటే డీప్ ఫ్రిజ్ కండీష‌న్ నుంచి బ‌య‌ట‌కు తీసిన త‌ర్వాత సాధార‌ణ ఫ్రిజ్‌లో ఐదు రోజుల నుంచి నెల రోజులు (31 రోజులు) ఉంచొచ్చ‌ని ఆమ్‌స్ట‌ర్‌డామ్‌కు చెందిన యురోపియ‌న్ మెడిసిన్ ఏజెన్సీ చెప్పింది. ఏదేమైనా, కొంత స‌మ‌యం మాత్ర‌మే ఫ్రిజ్‌లో ఉంచడానికి ముందు టీకాను సాధార‌ణ ఫ్రీజ‌ర్‌లో ఉంచొచ్చ‌ని మార్చి నెల‌లోనే యురోపియ‌న్ మెడిసిన్ ఏజెన్సి తెలిపింది.

వ్యాక్సిన్ నిర్వాహ‌ణలో, అలాగే స్టోర్ చేసుకోవ‌డంలో పెరిగిన సౌక‌ర్యం కార‌ణంగా యురోపియ‌న్ యూనియ‌న్ స‌భ్య రాజ్యాల‌లో వ్యాక్సిన్ వ్యాప్తికి సంబంధించి ప్ర‌ణాళిక‌, లాజిస్టిక్స్ పైన నిర్థిష్ట‌మైన ప్ర‌భావం ఉంటుంద‌ని ఆశిస్తున్నామ‌ని యురోపియ‌న్ మెడిసిన్ ఏజెన్సీ వెల్ల‌డించింది.
క‌రోనా వైర‌స్‌కు వ్య‌తిరేకంగా అధిక ప్ర‌భావం చూపిస్తున్న ఫైజ‌ర్ వ్యాక్సిన్‌కి ముందుగా సూప‌ర్‌-కూల్డ్ కండీష‌న్ అవ‌స‌రం కావ‌డం వ‌ల్ల వ్యాక్సిన్‌ స్టోరేజీలో, ర‌వాణాలో ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి తాజాగా వ‌చ్చిన స్టోరేజీ మార్పుతో ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని వాళ్లు ఆశిస్తున్నారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అతిపెద్ద‌ ఔష‌ద త‌యారీ ఫైజ‌ర్‌తో క‌లిసి జర్మన్ డెవలపర్ బయోఎన్‌టెక్ ఈ టీకాను తయారుచేస్తోంది. యురోపియ‌న్ మెడిసిన్ ఏజెన్సీకి అందిన కొత్త స‌మాచారం ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స్టోరేజీ కండీష‌న్లో వ‌చ్చిన ఈ మార్పు స్టెబిలిటీ స్ట‌డీస్ నుంచి తీసుకున్న కొత్త డాటా ఆధారంగా ఏర్ప‌డిందని, ఇది ఈ ప్రొడ‌క్ట్ క్వాలిటీని 31 రోజులుగా నిర్థారించిందని బ‌యోఎన్‌టెక్ తెలియ‌జేసింది.

Keywords:
Published by:Shiva Kumar Addula
First published: