CORONA VACCINE COVID VACCINATION FOR KIDS AGED 12 14 YEARS BEGINS FROM TODAY HERE IS THE STEP BY STEP PROCESS TO REGITSER SK
Covid Vaccination: నేటి నుంచే పిల్లలకు కరోనా టీకాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
Corona Vaccine for Kids: మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత.. రెండో డోసు ఇస్తారు. పిల్లలతో పాటు 60 ఏళ్లు పైబడినవాళ్లకు కూడా మూడో డోసును (బూస్టర్ డోస్) వేస్తారు. రెండో డోసు తీసుకొని 9 నెలల పూర్తయిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇస్తారు.
దేశవ్యాప్తంగా నేటి నుంచి పిల్లలకు కరోనా టీకాలు (Corona Vaccine for kids) వేస్తున్నారు. 12-14 ఏళ్ల పిల్లలకు కార్బివ్యాక్స్ (Corbevax) టీకాలను ఇస్తారు. నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనదేశంలో పెద్దలకు కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేశారు. ఐతే పిల్లలకు మాత్రం వీటిని కాకుండా.. కార్బివ్యాక్స్ టీకాలను వేస్తారు. హైదరాబాద్‌కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ ఈ టీకాలను తయారుచేసింది.2008, 2009, 2010లో పుట్టిన పిల్లలు (12-14 ఏళ్లు) కు మాత్రమే టీకాలను వేస్తారు. అర్హులైన వారంతా కోవిన్ పోర్టల్‌లో వివరాలు పొందుపరిచి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్ ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని టీకా తీసుకోవాలి. ఆన్లైన్ కోకుండా నేరుగా కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి.. అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత.. రెండో డోసు ఇస్తారు. పిల్లలతో పాటు 60 ఏళ్లు పైబడినవాళ్లకు కూడా మూడో డోసును (బూస్టర్ డోస్) వేస్తారు. రెండో డోసు తీసుకొని 9 నెలల పూర్తయిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇస్తారు. మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. మూడో డోసు కూడా అదే టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి.. 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ కరోనా టీకాలు ఇవ్వనున్నారు.
4. పిల్లల వ్యాక్సినేషన్ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలైన నిర్దిష్ట పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకుంటే పిల్లల స్కూల్ ID కార్డ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
5. వృద్ధుల ప్రికాషన్ డోస్ విషయానికొస్తే.. వారు మూడో డోస్‌కు అర్హులో కాదో.. రెండో డేస్ వేసుకున్ తేదీపై ఆధారపడి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు మూడో డోస్‌కు అర్హులో కాదో స్క్రీన్‌పై చూపిస్తుంది.
6. వృద్ధుల మూడో డోస్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆధార్ కార్డు ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పెన్షన్ పత్రాలను కూడా వినియోగించవచ్చు.
9. వివరాలను ఎంటర్ చేసిన తర్వాత.. మీ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానిని వెరిఫై చేయాల్సి ఉంటుంది.
9. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీరు స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. దాని కోసం మీ ప్రాంతం, పిన్‌కోడ్ మొదలైనవాటిని నమోదు చేయాలి.
10. ఆ తర్వాత మీకు ఖాళీగా ఉన్న స్లాట్స్‌లో మీకు అనువైన సమయాన్ని ఎంచుకొని.. బుక్ అపాయింట్మెంట్పై క్లిక్ చేయాలి. ఆ సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్తే టీకా వేస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.