Corona Vaccine in India | దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి. అయితే దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి అం డమాన్-నికోబార్ దీవులు కొత్త రికార్డును నెలకొల్పాయి.
దేశంలో రోజు రోజుకు కరోనా (Corona) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి. అయితే దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి అం డమాన్-నికోబార్ (Andaman and Nicobar) దీవులు కొత్త రికార్డును నెలకొల్పాయి. కేంద్రపాలిత ప్రాంతమైన ఇక్కడ అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా అందరికీ కోవిషీల్డ్ టీకానే అందించడం విశేషం. దీనికి సంబంధించి ట్విట్టర్ (twitter) లో అధికారికంగా తెలిపింది. 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతం మాత్రమే ఉంటుంది. ప్రతికూల వాతావరణంలో టీకాలు అందజేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. జనవరి 16 న ప్రారంభమైన టీకాల అందజేత శరవేగంగా పూర్తి చేయడంలో వైద్య సిబ్బంది కృషి చేశారు.
Vaccination in A&N was extremely challenging as the UT is spread over 836 islands Spread over 800 km from North to South separated by Rough Sea, Extremely Dense jungle, hills & exposed to Inclement weather.@MediaRN_ANI@Jitendra_Narainpic.twitter.com/eNvGYVHUU1
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోనూ అర్హులం దరికీ 100 శాతం రెం డు డోసుల వ్యా క్సిన్ ఇచ్చి న తొలి రాష్ట్రం గా రికార్డు సృ ష్టిం చిన విషయం తెలిసిం దే. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 53.87 లక్షల మం ది అర్హులకు డిసెంబరు 5 నాటికి అం దరికీ రెం డు డోసుల టీకా అందజేశారు.
పెరుగుతున్న కేసులు..
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 7,081 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,469 మంది కోలుకున్నారు. 264 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,40,275కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,41,78,940 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,77,422 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 83,913 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 570 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. భారత్‌లో 23 రోజులుగా కొత్త కేసులు 10వేల లోపే నమోదవుతున్నాయి. ఐతే ఇవాళ్టి బులెటిన్‌లో కూడా దాదాపు సగం కేసులు కేరళ నుంచేే వచ్చాయి. ఒక్క కేరళలో మాత్రమే వెయ్యి కంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.