CORONA VACCINATION DRIVE I URGE PEOPLE IN 12 14 AGE GROUPS TO GET VACCINATED SAYS PM NARENDRA MODI SK
Corona vaccine for Kids: ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.. పిల్లలకు టీకా వేయించండి: ప్రధాని మోదీ
5. అగ్ర రాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ఉన్న ప్రజామోదం కేవలం 43 శాతమే. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడేకు కూడా ఇంచుమించు ఇంతే ఆమోదం రేటు దక్కింది. బైడెన్ ఆరో స్థానంలో, ట్రూడే ఏడో స్థానంలో ఉన్నారు.
Corona vaccination Drive: 2008, 2009, 2010లో పుట్టిన పిల్లలు (12-14 ఏళ్లు) కు టీకాలను వేస్తారు. అర్హులైన వారంతా కోవిన్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ (India Corona Vaccination drive) ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. వారితో పాటు 60 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ (Booster Dose) కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇదొక ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు.
'' భారత పౌరులకు కరోనా టీకా వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఈరోజు ఎంతో ముఖ్యమైనది. 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కరోనా టీకా వేసుకునేందుకు అర్హులు. 60ఏళ్లు పైబడిన వారికి కూడా ప్రికాషన్ డోస్ వేస్తున్నాం. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వారంతా టీకాలు తీసుకోవాలి. '' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Today is an important day in India’s efforts to vaccinate our citizens. Now onwards, youngsters in the 12-14 age group are eligible for vaccines and all those above 60 are eligible for precaution doses. I urge people in these age groups to get vaccinated.
ఇండియా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్దదని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటి వరకు 180 కోట్ల డోసుల వ్యాాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఇన్ని డోసుల టీకాలు వేయడం చిన్నవిషయం కాదని తెలిపారు. భారత్లో ఎన్నో స్వదేశీ కరోనా టీకాలు ఉన్నాయి.. కరోనాపై యావత్ ప్రపంచం చేస్తున్న పోరాటంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని మోదీ చెప్పారు.
Today, India has administered over 180 crore doses, which includes over 9 crore doses in age group of 15-17 and over 2 crore precaution doses. This forms an important protective shield for our citizens against COVID-19.
నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కార్బివ్యాక్స్ (Corbevax) టీకాలను ఇస్తారు. మనదేశంలో పెద్దలకు కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేశారు. ఐతే పిల్లలకు మాత్రం వీటిని కాకుండా.. కార్బివ్యాక్స్ టీకాలను వేస్తారు. హైదరాబాద్కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ ఈ టీకాలను తయారుచేసింది.2008, 2009, 2010లో పుట్టిన పిల్లలు (12-14 ఏళ్లు) కు టీకాలను వేస్తారు. అర్హులైన వారంతా కోవిన్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్ ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని టీకా తీసుకోవాలి. ఆన్లైన్ కోకుండా నేరుగా కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి.. అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.