• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • CORONA UPDATES PM NARENDRA MODI MEETS TOP GOVT OFFICIALS TO REVIEW COVID 19 SITUATION AND VACCINE STATUS SECOND MEETING IN 2 DAYS SK

PM Narendra Modi: కరోనాపై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష.. నైట్ కర్ఫ్యూ విధిస్తారా?

PM Narendra Modi: కరోనాపై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష.. నైట్ కర్ఫ్యూ విధిస్తారా?

ప్రధాని మోదీ వర్చువల్ మీటింగ్

PM Narendra Modi Covid-19 Review Meeting: చాలా రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదువుతున్న నేపథ్యంతో రాత్రి కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌పై పంజా విసురుతోంది. లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు.  పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. కరోనా కట్టడి దిశగా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. శనివారం రాత్రి పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.కరోనా కట్టడి దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మెడిసిన్స్, ఆక్సిజన్, వెంటిటేటర్స్, వ్యాక్సినేషన్ సహా పలు వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

    శుక్రవారమే ప్రధాని మోదీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆస్పత్రుల్లో ఆక్సీజన్ సరఫరాతో పాటు వ్యాక్సినేషన్ గురించి అధికారులతో చర్చించారు. అంతలోనే ఇవాళ మరోసారి వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించే అంశంపైనా సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. చాలా రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదువుతున్న నేపథ్యంతో రాత్రి కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

    మరోవైపు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కోవిడ్ వ్యాక్సినేషన్, ఆక్సీజన్ సరఫరా, కోవిడ్ కట్టడికి చర్యలు వంటి పలు అంశాలపై చర్చించారు.



    మరోవైపు మనదేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. కొత్తగా 1,341 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,23,354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220కి చేరింది. రికవరీ రేటు 87.2 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు