Kerala Oxygen Supply: దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరత.. కేరళలో మాత్రం మిగులు.. ఇదెలా సాధ్యమైంది?

Kerala Oxygen Supply: దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరత.. కేరళలో మాత్రం మిగులు.. ఇదెలా సాధ్యమైంది?

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని అనేక రాష్ట్రాలు మెడికల్​ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న వేళ.. కేరళ రాష్ట్రం మాత్రం దీనికి భిన్నంగా ఆక్సిజన్ కొరతను అధిగమించింది. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సీజన్ ఉంది. ఇది ఎలా సాధ్యమైంది?

  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్​ వేవ్​ విజృంభన కొనసాగుతోంది. రోజుకు మూడు లక్షల వరకు పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా పేషంట్లకు అత్యవసరంగా అందించాల్సిన మెడికల్​ ఆక్సిజన్​కు డిమాండ్​ పెరుగుతోంది. ఉత్పత్తి, సరఫరా తక్కువగా ఉండటంతో అనేక రాష్ట్రాలను ఆక్సిజన్​ సిలిండర్ల​ కొరత వేధిస్తోంది. సమయానికి ఆక్సిజన్​ అందక చనిపోతున్న కరోనా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు మెడికల్​ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న వేళ.. కేరళ రాష్ట్రం మాత్రం దీనికి భిన్నంగా ఆక్సిజన్ కొరతను అధిగమిస్తూ.. ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తోంది. గోవా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు మెడికల్​ ఆక్సిజన్​ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది. గత వారంలో గోవాలోని ఆసుపత్రులకు 19 మెట్రిక్ టన్నులు, తమిళనాడులోని ఆసుపత్రులకు 72 మెట్రిక్ టన్నులు, కర్ణాటకలోని ఆసుపత్రులకు 36 మెట్రిక్ టన్నుల మెడికల్​ ఆక్సిజన్​ను సరఫరా చేసింది. అయితే, అన్ని రాష్ట్రాలను ఆక్సిజన్​ కొరత వేధిస్తోండగా.. కేరళ మాత్రం ఆక్సిజన్​ మిగులును నిర్వహిస్తుండటం ఆసక్తికరం.

దీనిపై పెసో డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా మిగులు ఉంది. కేరళలో 123 ఏళ్ల క్రితమే ఆక్సిజన్​ ఉత్పత్తి కేంద్రమైన పెట్రోలియం అండ్​ ఎక్స్​ప్లోజివ్స్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​(పెసో)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడమే దీనికి ఏకైక కారణం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మెడికల్​ ఆక్సిజన్​ సరఫరా చేయడం పెసో బాధ్యత. కాగా, గత ఏడాది నుంచి కరోనా విజృంభనతో ఆక్సిజన్​ డిమాండ్​ పెరిగింది. దీంతో పెసో రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి 2020 మార్చి నుండి ప్రాణవాయువు అవసరాలను తీరుస్తోంది. సాధారణంగా ఈ ఆక్సిజన్లను పరిశ్రమల కోసం ఉత్పత్తి చేస్తాం. అయితే, కరోనాతో వీటికి డిమాండ్​ పెరగడంతో ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నాం. తద్వారా కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఆక్సిజన్​ సిలిండర్లను సరఫరా చేయగలుగుతున్నాం.” అని ఆయన అన్నారు.

తయారీ, నిల్వ సామర్థ్యం
ప్రస్తుతం కేరళలోని ఆక్సిజన్ ప్లాంట్లకు ఒకే రోజులో 199 మెట్రిక్ టన్నుల మెడికల్​ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. ఏప్రిల్ 18 వరకు కేరళ రోజుకు 89.75 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు పేర్కొంది. వీటిలో అధిక భాగం కంజికోడ్‌లో ఉన్న ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండే ఉత్పత్తి అయ్యింది. మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్​తో సహా రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆసుపత్రులకు ఐనాక్స్ కంపెనీ మెడికల్​ ఆక్సిజన్​ను సరఫరా చేస్తుంది. దీనితో పాటు కేరళలో ఉన్న మరో ఆక్సిజన్​ ఉత్పత్తి సంస్థ ప్రాక్సేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజుకు 6 మెట్రిక్ టన్నుల వైద్య ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్లన్నీ కలిపి రోజుకు 1,325 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో ఐనాక్స్ ప్లాంట్ 1,000 మెట్రిక్ టన్నుల వద్ద అతిపెద్ద నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

స్థిరంగా పెరుగుతోన్న ఆక్సిజన్ డిమాండ్
ఏప్రిల్ 7 నాటికి, కేరళలోని కరోనా రోగులకు మొత్తం 20.6 మెట్రిక్ టన్నుల మేర మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉండేది. అయితే, గత రెండు వారాల నుడి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ డిమాండ్ రోజుకు 31.60 మెట్రిక్ టన్నుల వరకు పెరిగింది. అయినప్పటికీ, రాష్ట్రంలోని ప్రతి కరోనా రోగికి దిగ్విజయంగా ఆక్సిజన్​ అవసరాన్ని తీర్చగలిగి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Published by:Shiva Kumar Addula
First published: