Oxygen: కరోనా కల్లోలం వేళ.. ఆక్సీజన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు ఆదేశాలు

Oxygen: కరోనా కల్లోలం వేళ.. ఆక్సీజన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ఆక్సీజన్ సరఫరా కోసం రైల్వేశాఖ ముందుకొచ్చింది. ఆక్సీజన్ సిలిండర్లను వేగవంతంగా సరఫరా చేసేందుకు ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో పాటు ఆక్సీజన్ సిలిండర్లను సరఫరా చేసేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది

 • Share this:
  మన దేశంపై కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. కరోనా పేషెంట్లు లక్షల్లో పెరుగుతున్నారు. వేలల్లో రోగులు మరణిస్తున్నారు. ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. అంతేకాదు రోగుల ప్రాణాల కాపాడే ఆక్సీజన్ కొరత కూడా వేధిస్తోంది. ఆక్సీజన్ కొరతపై ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఆక్సీజన్ సరఫరా నిలిపివేసి.. వాటిని ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఐతే 9 పరిశ్రమలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

  ఫార్మసూటికల్, పెట్రోలియం రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఫెసిలిటీలు, ఆక్సీజన్ సిలిండర్లు మ్యానుఫ్యాక్చర్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ అండ్ వాటర్ పురిఫికేషన్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇవీ మినహా మిగతా అన్నింటికి ఏప్రిల్ 22 నుంచి ఆక్సీజన్ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రహోంశాఖ అజయ్ భల్లా లేఖ రాశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆక్సీజన్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

  మరోవైపు ఆక్సీజన్ సరఫరా కోసం రైల్వేశాఖ ముందుకొచ్చింది. ఆక్సీజన్ సిలిండర్లను వేగవంతంగా సరఫరా చేసేందుకు ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో పాటు ఆక్సీజన్ సిలిండర్లను సరఫరా చేసేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకుండా.. ఆలస్యం జరగడకుండా.. ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆక్సీజన్ సిలిండర్లను రైళ్ల ద్వారా తరలించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఇటీవలే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు రైల్వేశాఖకు లేఖరాశాయి. ఈ క్రమంలోనే ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ ప్రారంభించింది.


  కాగా, దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆక్సీజన్ కొరత నెలకొంది. శ్వాస సంబంధ ఇబ్బందులతో ఉన్న రోగులకు ఆక్సీజన్ తప్పనిసరి. ప్రస్తుతం మనదేశంలో లక్షలాది కేసులు కేసులు నమోదవుతుండడంతో.. ఆక్సీజన్‌కు డిమాండ్ ఏర్పడింది. చాలా చోట్ల ఆక్సీజన్ అందక పేషెంట్లు చనిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోవిడ్ ఆస్పత్రుల్లో సరిపడినంత ఆక్సిజన్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.
  Published by:Shiva Kumar Addula
  First published: