భారత్‌లో కరోనా బీభత్సం.. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదు

గడిచిన 24 గంటల్లో మనదేశంలో 11,72,179 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 4 కోట్ల 55 లక్షల 9,380 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

news18-telugu
Updated: September 3, 2020, 9:52 AM IST
భారత్‌లో కరోనా బీభత్సం.. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మనదేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 83,883 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,043 మంది మరణించారు. నిన్న 68,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. కరోనాను జయించి 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 8,15,538 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 11,72,179 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 4 కోట్ల 55 లక్షల 9,380 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 8,25,739 మందికి కరోనా సోకగా.. 25,195 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4,55,531 కేసులు నమోదవగా.. 4,125 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు:
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
Published by: Shiva Kumar Addula
First published: September 3, 2020, 9:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading