ముందుంది ముంచే కాలం.. కరోనా థర్డ్ వేవ్ మరింత డేంజర్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోందని.. కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఆయన హెచ్చరించారు.

 • Share this:
  దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కబళిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద మొత్తంలో పెరిగిపోతున్నాయి. మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి చెందుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోందని.. కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఆయన హెచ్చరించారు.

  '' కరోనా వ్యాక్సినేషన్ కూడా మహమ్మారి కట్టడికి సరిపోవడం లేదు. భవిష్యత్ సన్నద్ధత కోసమే ఇది సాయం చేస్తుంది. గతంలో సృష్టించిన టాస్క్‌ఫోర్స్ వల్లే ఇప్పుడు మనం ఇప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇందులో సైన్స్, మెడికల్ ఫ్యాక్ట్స్ తప్ప.. ఎలాంటి రాజకీయాలు లేవు. ప్రస్తుతం థర్డ్ వేవ్ కట్టడికి సన్నద్ధమవుతున్నాం. రాష్ట్రంలో 5 లక్షల బెడ్స్ ఉన్నాయి. 70శాతం బెడ్స్‌కు ఆక్సీజన్ ఫెసిలిటీ ఉంది.'' అని ఆదిత్య థాకరే పేర్కొన్నారు.

  ఆదిత్య థాక్రే

  ప్రస్తుతం మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులున్నాయి. ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే కరోనా నిబంధనలను కట్టుదిట్టం చేస్తున్నారు. గత బుధవారం రాత్రి నుంచి మే 1 ఉదయం 7 గంటల వరకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు సహా అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్రలో తదుపరి ఆదేశాల వరకు సెలూన్ షాప్‌లు, స్పా సెంటర్లు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, బీచ్‌లు, క్లబ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, డ్రామా థియేటర్లు, సినిమా హాళ్లు మూసివేశారు.


  కాగా, మహారాష్ట్రలో శనివారం 67,123 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న 56,783 మంది డిశ్చార్జి అవగా.. మరో 419 మంది మరణించారు. తాజా లెక్కలతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 37 లక్షల 70వేల 707కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 30 లక్షల 61వేల 174 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 59,970 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసలున్నాయి
  Published by:Shiva Kumar Addula
  First published: