Oxygen Scarcity: ఆక్సీజన్ అందక 25 మంది మృతి.. ఢిల్లీ పిట్టల్లా రాలుతున్న రోగులు

Oxygen Scarcity: ఆక్సీజన్ అందక 25 మంది మృతి.. ఢిల్లీ పిట్టల్లా రాలుతున్న రోగులు

ప్రతీకాత్మక చిత్రం

శ్రీగంగారామ్ ఆస్పత్రిలో ఆక్సీజన్ నిల్వలు అడుగంటి పోయాయని ఎస్‌వోఎస్ ద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన కాసేపటికే... ఆస్పత్రికి ఆక్సీజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారీ భద్రత నడుమ ఆక్సీజన్ ట్యాంకర్లను ఆస్పత్రికి తరలించారు.

  • Share this:
    ఆక్సీజన్ లేక కరోనా రోగులు అల్లాడిపోతున్నారు. ఊపిరాడక పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు.  దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. తాజాగా దేశ రాజధానిలో ఘోరం జరిగింది. శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సీజన్ అందుబాటులో లేక 24 గంటల వ్యవధిలో 25 మంది మరణించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు కూడా పనిచేయడం లేదని శ్రీ గంగారామ్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ తెలిపారు. ''మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది. వెంటిలేటర్లు కూడా పనిచేయడం లేదు. ఆక్సీజన్ అందక 24 గంటల్లో 25 మంది కోవిడ్ రోగులు మరణించారు. మరో 60 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి' అని పేర్కొన్నారు.

    శ్రీగంగారామ్ ఆస్పత్రిలో ఆక్సీజన్ నిల్వలు అడుగంటి పోయాయని ఎస్‌వోఎస్ ద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన కాసేపటికే... ఆస్పత్రికి ఆక్సీజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారీ భద్రత నడుమ ఆక్సీజన్ ట్యాంకర్లను ఆస్పత్రికి తరలించారు.


    ఢిల్లీలోని శ్రీగంగా రామ్ ఆస్పత్రిలో 510 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 142 మంది ఆక్సీజన్ సపోర్టులో ఉన్నారు. రోగులు ఎక్కువగా ఉండడ. ఆక్సీజన్ నిల్వలు తక్కువగా ఉండడంతో ఇటు డాక్టర్లు, అటు రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి సరిపడా ఆక్సీజన్‌ను పంపించాలని కోరుతున్నారు.

    ఇదొక్కటే కాదు ఢిల్లీ చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. మొత్తం ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగిలిన ఆస్పత్రుల్లో కూడా మరికొన్ని గంటల వరకే ఆక్సీజన్ సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆక్సీజన్ అందక వందలాది మంది మరణించారు.

    మన దేశంలో గురువారం 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,93,279 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 2263 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,62,63,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకోగా.. 1,86,920 మంది చనిపోయారు. ప్రస్తుతం 24,28,616 మంది మరణించారు. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 67,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో 34,254, కేరళలో 26,995, ఢిల్లీలో 26,169, కర్నాటకలో 25,795, ఛత్తీస్‌గఢ్‌లో 16,750 కొత్త కేసులు నమోదయ్యాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: