ప్రపంచంలో మరింత తీవ్రంగా కరోనా... అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన మృతులు

Corona Lockdown | Corona Update : ఓవైపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ నుంచి బయటపడాలనుకుంటుంటే... కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది.

news18-telugu
Updated: April 29, 2020, 5:28 AM IST
ప్రపంచంలో మరింత తీవ్రంగా కరోనా... అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన మృతులు
ప్రపంచంలో మరింత తీవ్రంగా కరోనా... అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన మృతులు
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ సడెన్‌గా విజృంభిస్తోంది. నాల్రోజులుగా కాస్త తగ్గినట్లు కనిపించిన కరోనా... మంగళవారం ఒక్కసారిగా పెరిగిపోయింది. మంగళవారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 75563 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య. 3135509కి చేరింది. అలాగే... మంగళవారం 6297 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 217745కి చేరింది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం 952942 మంది రికవరీ అవ్వగా... 1964822 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో 1907515 మందికి కరోనా కొద్దిగానే ఉంది. 57307 మందికి మాత్రం తీవ్రంగా ఉంది. మొత్తం కేసుల్లో సీరియస్ కేసులు 3 శాతంగా ఉన్నాయి.

కరోనా ఒక్కసారిగా పెరగడానికి అమెరికా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అక్కడ నిన్న ఒక్క రోజే... 24884 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 1035240కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 2429 మంది చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. ఈ మధ్య కాలంలో కరోనాతో ఇంత మంది ఒకే రోజులో చనిపోయిన సందర్భం లేదు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 59225కి చేరింది.

స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, కెనడా వంటి దేశాల్లో కరోనా మెల్లగా కంట్రోల్ అవుతుంటే... బ్రిటన్, టర్కీ, రష్యా, బ్రెజిల్, పెరు వంటి దేశాల్లో కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అంటే... కరోనా కొన్ని దేశాల్లో తగ్గుతుంటే... మరిన్ని దేశాల్లో పెరుగుతోందన్న సంకేతం కనిపిస్తోంది.

చైనాలో యాక్టివ్ కేసులు 648గా ఉన్నాయి. ఆ దేశంలో రెండు వారాల్లో 400 కేసులు రికవరీ అయిపోయాయి. అంటే... మరో 2 వారాల్లో చైనా పూర్తిగా కరోనా నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. ఐతే... మంగళవారం చైనాలో కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో ఇప్పటివరకు 29,974 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కొవిడ్‌ 19తో పోరాడి 7,027 మంది కోలుకోగా... 937 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,010 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఐతే... మహారాష్ట్ర, గుజరాత్‌‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌... ఈ 6 రాష్ట్రాల్లోనే కరోనా అత్యంత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 8590 కేసులుండగా... గుజరాత్‌లో 3548 కేసులున్నాయి. ఢిల్లీలో 3108 ఉండగా... మధ్యప్రదేశ్‌లో 2368, రాజస్థాన్‌లో 2262, ఉత్తరప్రదేశ్‌లో 2043 కేసులున్నాయి. ఈ రాష్ట్రాలపై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

తెలంగాణలో కరోనా తగ్గుతోంది. మంగళవారం కొత్తగా 6 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 1009కి చేరాయి. రాష్ట్రంలో కొత్తగా 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 374గా ఉంది. ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 610 మందిగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కారణంగా 25 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా డేంజర్ లేని జిల్లాలు 22 ఉన్నాయని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 5783 సాంపిల్స్‌ని పరీక్షించగా 82 మంది కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1259కి చేరింది. వీరిలో 258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది మరణించారు. గత 48 గంటల్లో ఎవరూ చనిపోలేదు. ప్రస్తుతం కరోనా ఐసోలేషన్ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్న వారి సంఖ్య 970గా ఉంది.
Published by: Krishna Kumar N
First published: April 29, 2020, 5:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading