30 లక్షలకు చేరువలో కరోనా కేసులు... ఒక్క అమెరికాలోనే దాదాపు 10 లక్షలు

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ తన రికార్డుల్ని తనే తిరగరాసుకుంటోంది. రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది.

news18-telugu
Updated: April 27, 2020, 5:38 AM IST
30 లక్షలకు చేరువలో కరోనా కేసులు... ఒక్క అమెరికాలోనే దాదాపు 10 లక్షలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : అమెరికాకు జలుబు చేస్తే... ప్రపంచానికి జ్వరం వస్తుందనే నానుడి ఉంది. అది నిజం. కరోనా విషయంలో ఒక్క అమెరికాలో పెరుగుతున్న కేసుల వల్ల ప్రపంచం మొత్తం ఆ ప్రభావం పడుతోంది. ఆదివారం 73437 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 2992841కి చేరింది. అలాగే ఆదివారం 3730 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 206894కి చేరింది. ఐతే... రోజూ 5వేల మందికి పైగా చనిపోతున్నారు. ఆదివారం ఈ సంఖ్య వెయ్యికి పైగా తగ్గడం ఒకింత గుడ్ న్యూస్.

ప్రస్తుతం రికవరీ అయిన వారి సంఖ్య 877254గా ఉంది. అందువల్ల 1908693 మంది కరోనాతో బాధపడుతున్నారు. వారిలో 1851102 మందికి కరోనా అంతంతమాత్రంగా ఉంది. 57591 మందికి తీవ్రంగా ఉంది. వీరికి ICU ట్రీట్‌మెంట్ అమల్లో ఉంది.

ప్రపంచం ఆందోళన చెందుతున్నది అమెరికా గురించే. ఎందుకంటే... అక్కడ ఆదివారం కొత్తగా 26369 కేసులు నమోదయ్యాయి. రోజూతో పోల్చితే ఇది కాస్త తక్కువే అయినా... మొత్తం కేసుల సంఖ్య 987020కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం 1151 మంది చనిపోవడంతో... మృతుల సంఖ్య 55407కి చేరింది. అంటే... ప్రపంచంలో మొత్తం కరోనా మరణాల్లో 25 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయి.

ఇక స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ, ఇరాన్, రష్యా, బ్రెజిల్, కెనడా, ఇండియా, పెరు, సౌదీ అరేబియా, దేశాల్లో కొత్త కేసులు వెయ్యికి పైగానే నమోదవుతున్నాయి. రష్యాలో ఆదివారం 6361 కేసులు రాగా... బ్రిటన్‌లో 4463 నమోదయ్యాయి. బ్రెజిల్‌లో 3591 కొత్త కేసులొచ్చాయి. ఇలా కొన్ని దేశాల్లో కొత్త కేసులు ఊహించలేని విధంగా పెరుగుతున్నాయి.

ఇండియాలో కూడా కరోనా జోరుగా ఉంది. తాజాగా లెక్కల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 26917 కాగా... వాటిలో 5914 కేసుల్లో రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. అలాగే మృతుల సంఖ్య 826గా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే మాత్రం ఇండియాలో కరోనా చాలా తక్కువగా ఉన్నట్లే.

కరోనా వైరస్ ఏపీ రాజ్‌భవన్‌ను తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. తాజా లెక్కల ప్రకారం ఏపీలో 1097 మందికి కరోనా వైరస్ సోకింది. విజయనగరం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కరోనా ఉంది. 835 యాక్టివ్ కేసులున్నాయి. 231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1001కి చేరింది. ఆదివారం 11 కొత్త కేసులొచ్చాయి. కొత్తగా 9 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం వచ్చిన కేసులన్నీ GHMC పరిధిలోవే. రాష్ట్రంలో 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 25 మంది చనిపోయారు.
Published by: Krishna Kumar N
First published: April 27, 2020, 5:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading