ప్రపంచంలో 40 లక్షలు దాటిన కరోనా కేసులు... పెరుగుతున్న మరణాలు...

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ జోరు తగ్గట్లేదు. సీరియస్ కేసుల సంఖ్య తగ్గినా... ఓవరాల్‌గా పెరుగుతోంది.

news18-telugu
Updated: May 9, 2020, 5:27 AM IST
ప్రపంచంలో 40 లక్షలు దాటిన కరోనా కేసులు... పెరుగుతున్న మరణాలు...
ప్రపంచంలో 40 లక్షలు దాటిన కరోనా కేసులు... పెరుగుతున్న మరణాలు... (credit - WHO)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి పెరుగుతోంది. సీరియస్ కేసుల సంఖ్య తగ్గుతుంటే... కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శుక్రవారం కొత్తగా 95828 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 4009472కి చేరింది. శుక్రవారం కొత్తగా 5488 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 275914కి చేరింది. ఐతే... ఇదివరకు 55వేల దాకా ఉండే సీరియస్ కేసులు... ఇప్పుడు 48653 దాకా ఉన్నాయి. వీళ్లందరికీ ICUలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. మొత్తం కేసుల్లో వీళ్ల సంఖ్య 2 శాతంగా ఉంది.

అమెరికాలో కరోనా మళ్లీ జోరుగా ఉంది. నిన్న ఒక్కరోజే 28060 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 1320683కి చేరింది. నిన్న 1629 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 78557కి చేరింది. మిగతా అన్ని దేశాల కంటే అమెరికాలోనే మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.

అమెరికా తర్వాత... రష్యా (10699), బ్రెజిల్ (10199), బ్రిటన్ (4649), ఇండియా (3342), పెరు (3321) స్పెయిన్ (3262) దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో నిన్న ఒక్కరోజే 626 మరణాలు సంభవించగా... బ్రెజిల్‌లో 804 మంది నిన్న చనిపోయారు. చూస్తుంటే... ఇప్పుడు అమెరికా తర్వాత... ఎక్కువ మరణాలు వస్తున్నది బ్రెజిల్‌లోనే. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో అనే ఆందోళన ఉంది.

ఇండియాలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 56342కి చేరింది. మరణాల సంఖ్య 1886కి చేరింది. ఇండియాలో కరోనా కంట్రోల్ అవ్వని పరిస్థితులు ఉండటంతో... కరోనాతో కలిసి జీవించాల్సిందేనని కేంద్రం చెబుతోంది.

తెలంగాణలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1132కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయన్న ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్... మరో 14 జిల్లాలను గ్రీన్ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.

ఏపీలో కొత్తగా 54 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 1887కి చేరింది. నిన్న ముగ్గురు చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.
First published: May 9, 2020, 5:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading