రూట్ మార్చిన కరోనా... అమెరికాలో డౌన్... రష్యా, బ్రెజిల్‌లో జోరు...

Corona Lockdown | Corona Update : వ్యాక్సిన్ లేని వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు గట్టిగానే పోరాడుతున్నాయి.

news18-telugu
Updated: May 11, 2020, 5:00 AM IST
రూట్ మార్చిన కరోనా... అమెరికాలో డౌన్... రష్యా, బ్రెజిల్‌లో జోరు...
రూట్ మార్చిన కరోనా... అమెరికాలో డౌన్... రష్యా, బ్రెజిల్‌లో జోరు... (credit - WHO)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ అమెరికాలో పీక్ స్టేజ్‌కి వెళ్లి... ఇప్పుడు రివర్స్ ట్రెండ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త కేసులు తగ్గగా... మరణాల సంఖ్య సగానికి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 78608 కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 4176887కి చేరింది. అలాగే... ఆదివారం 3454 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 283678కి చేరింది. ప్రస్తుతం 2358739 మందికి కరోనా లక్షణాలు అంతంతమాత్రంగా ఉండగా... 47016 మందికి మాత్రం కరోనా ఎక్కువగా ఉంది. అందువల్ల అమెరికాలో జోరు తగ్గిస్తున్న కరోనా... క్రమంగా రష్యా, బ్రెజిల్‌లో పెరుగుతూ... ఆ దేశాలను భయపెడుతోంది.

ఆదివారం అమెరికాలో 19444 కేసులు రాగా... మొత్తం కేసుల సంఖ్య 1366753కి చేరింది. కొత్త కేసులు దాదాపు 10 వేల దాకా తగ్గాయి. మరణాలు ఆదివారం 720 నమోదవ్వగా... మొత్తం మరణాలు 80757కి చేరాయి. ఐతే... ఆదివారం మరణాలు సగానికి పైగా తగ్గాయనుకోవచ్చు. ఇదే తీరు కొనసాగితే... అమెరికాలో క్రమంగా కరోనా జోరు తగ్గే అవకాశాలుంటాయి.

రష్యాలో ఆదివారం 11012 కేసులు నమోదయ్యాయి. అలాగే బ్రెజిల్‌లో కొత్తగా 6638 కేసులొచ్చాయి. ఈ రెండు దేశాల్లో ఇప్పుడు కరోనా అత్యంత ఎక్కువగా పాకుతోంది. ఇక్కడ క్రమంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆదివారం రష్యాలో... 88 మంది చనిపోగా... బ్రెజిల్‌లో 467 మంది చనిపోయారు. ఈ దేశాలు కరోనా మొదట్లో రాకపోవడంతో... పెద్దగా పట్టించుకోలేదు. తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి.

చైనాలో మళ్లీ 14 కేసులొచ్చాయి. చైనా తర్వాత ఎక్కువగా కరోనా సోకిన ఇటలీలో ఇప్పటికీ కొత్తగా 802 కేసులు నమోదయ్యాయి. అంటే... కరోనా ఓ దేశానికి వస్తే... ఇక పోవట్లేదు. పూర్తిగా కరోనా ఫ్రీ అవ్వడం అనేది వీలవ్వట్లేదు. చైనాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 148 మాత్రమే. ఆ దేశం రెండు వారాల్లో కరోనా ఫ్రీ దేశం అయ్యే అవకాశాలున్నాయి. ఐతే... కొత్త కేసులు రావనేందుకు మాత్రం గ్యారెంటీ కనిపించట్లేదు.

ఇండియాలో ఓవైపు కరోనా పెరుగుతుంటే... మరోవైపు అన్ని రంగాలకూ తలుపులు తెరచుకుంటూ... కరోనా మరింత పెరిగేందుకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఒకప్పుడు 1000 కేసులు కూడా లేనప్పుడు ఎన్నో కండీషన్లు ఉండేవి... ఇప్పుడు... 62వేలకు పైగా కేసులున్నప్పుడు కండీషన్లన్నీ పక్కన పెడుతున్నాయి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇది విచిత్రమే. ఇండియాలో తాజాగా 3277 కొత్త కేసులొచ్చాయి. ఒక్క రోజులో 128 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 2109కి చేరింది. ప్రస్తుతం దేశంలో 41472 మంది కరోనాతో బాధపడుతున్నారు.

తెలంగాణలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 9న కూడా 31 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1196 కాగా, 751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 30 మంది చనిపోయారు. ప్రస్తుతం 415 మంది యాక్టివ్ కేసులుగా ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ఏపీలో మరో 50 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 8666 మందికి టెస్టులు చెయ్యగా... ఈ కొత్త కేసులు వచ్చాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1980కి చేరింది. అలాగే... ఒకరు చనిపోవడంతో... మరణాల సంఖ్య 45కి చేరింది. ఏపీలో 925 మంది డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1010గా ఉంది.
Published by: Krishna Kumar N
First published: May 11, 2020, 5:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading