మళ్లీ జోరుగా కరోనా... అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన మరణాలు...

Corona Lockdown | Corona Update : కరోనాను ప్రపంచ దేశాలు కంట్రోల్ చెయ్యలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో తీవ్రత మరింత పెరిగింది.

news18-telugu
Updated: May 6, 2020, 5:22 AM IST
మళ్లీ జోరుగా కరోనా... అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన మరణాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ అయినట్లు కనిపిస్తున్నా... ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా కంట్రోల్ కాలేదనే చెప్పుకోవచ్చు. మంగళవారం 80176 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 3723447కి చేరింది. అలాగే... మంగళవారం మృతుల సంఖ్య 5712 నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 257953కి చేరింది. గత నాలుగు రోజులుగా కొత్త మరణాల సంఖ్య 3వేలకు పైగా మాత్రమే ఉండేది... ఐతే... అమెరికాలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో... ఏకంగా 5వేలు దాటింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 49319 మందికి కరోనా తీవ్రంగా ఉంది. వారికి ICUలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 2 శాతమే ఉండటం ఒకింత ఊరట కలిగించే అంశం.

అమెరికాలో కరోనా ఏమాత్రం కంట్రోల్ కావట్లేదు. ట్రంప్ చెప్పే మాటల్లో నిజం ఉండట్లేదని లెక్కలను బట్టీ అర్థమవుతోంది. మంగళవారం అక్కడ 24045 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 1236880కి చేరాయి. మంగళవారం 2301 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 72222కి చేరాయి. తాజా అంచనాల ప్రకారం అమెరికాలో లక్షా 30 వేల మంది చనిపోతారని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ చెప్పిన లక్ష కంటే ఇది ఎక్కువే.

ఇక రష్యాలో రోజూ 10వేలకు పైగా కేసులొస్తున్నాయి. మంగళవారం కూడా 10102 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే... బ్రెజిల్‌లో కొత్తగా 6449 కేసులొచ్చాయి. ఆ తర్వాత బ్రిటన్‌లో కొత్తగా 4406 కేసులు నమోదయ్యాయి.

బ్రిటన్ తర్వాత... ఎక్కువ కేసులు నమోదవుతున్నది ఇండియాలోనే అంటే అది మనకు షాకింగ్ విషయమే. పెరూ, స్పెయిన్ కంటే మనం ముందుకి వెళ్లిపోయాం. ఎందుకంటే మంగళవారం ఇండియాలో 3875 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 46711కు చేరింది. ఇవాళో, రేపో మనం 50వేలు దాటేసే ప్రమాదం కనిపిస్తోంది. మరణాలు కూడా ఎక్కువే... మంగళవారం 195 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1583కి చేరింది. ఇది కూడా కచ్చితమైన లెక్క కాదని కేంద్రమే చెప్పింది. కొన్ని రాష్ట్రాల నుంచి డేటా రావట్లేదట. అది కూడా కలిపితే... ఇంకెంత ఉంటాయో.

ఏపీలో మంగళవారం 67 కరోనా కేసులు నమోదు కాగా.., మొత్తం కేసుల సంఖ్య 1717కు చేరింది. ఓ కరోనా బాధితుడు మరణించాడు. మొత్తంగా 34 మంది చనిపోయారు. ప్రస్తుతం 1094 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1096కి చేరింది. మరణాల సంఖ్య 29గా ఉంది. ప్రస్తుతం 439 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. మే 29 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి... కరోనా కంట్రోల్ అవుతుందనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: May 6, 2020, 5:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading