ప్రపంచంలో 24 లక్షలు దాటిన కరోనా కేసులు.... సీరియస్ కేసుల్లో తగ్గుదల...

Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా సీరియస్ కేసుల సంఖ్య తగ్గుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశమే.

news18-telugu
Updated: April 20, 2020, 5:20 AM IST
ప్రపంచంలో 24 లక్షలు దాటిన కరోనా కేసులు.... సీరియస్ కేసుల్లో తగ్గుదల...
ప్రపంచంలో 24 లక్షలు దాటిన కరోనా కేసులు.... సీరియస్ కేసుల్లో తగ్గుదల...
  • Share this:
Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా... వాటిలో... పరిస్థితి సీరియస్‌గా ఉండే వారి సంఖ్య తగ్గుతుండటం ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆదివారం 74052 కొత్త కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 2404818కి చేరింది. అలాగే... ఆదివారం 4875 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 164922కి చేరింది. మరణాల సంఖ్య 5వేల కంటే తక్కువ నమోదవడం... రెండు వారాల్లో ఇదే తొలిసారి అనుకోవచ్చు. రోజూ 5వేలకు పైనే ఉంటున్నాయి. 624849 మంది వ్యాధి నుంచి కోలుకోవడం వల్ల... ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 1615047గా ఉంది. వారిలో 1560822 మందికి కరోనా ఉన్నా... లేనట్లే అనుకోవచ్చు. ఎందుకంటే... అది అంతంత మాత్రంగానే ఉంది. 54225 మందికి మాత్రం కరోనా సీరియస్‌గా ఉంది. కానీ... మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 3 శాతమే. ఆదివారం వరకు ఇది 4 శాతంగా ఉండేది. వారం కిందట ఇది 5 శాతంగా ఉండేది. అంటే దానర్థం ఏంటి... వారం వారం సీరియస్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నమాట. అంటే మనం కరోనాపై మెల్లమెల్లగా పైచేయి సాధిస్తున్నట్లే.

అమెరికాలో ఆదివారం 24787 కేసులు రాగా... మొత్తం కేసుల సంఖ్య 763579కి చేరింది. అలాగే... ఆదివారం 1510 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 40524కి చేరింది. ఐతే... కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది.

స్పెయిన్‌లో కొత్తగా 4258 మందికి కరోనా రాగా.... మొత్తం కేసుల సంఖ్య 198674కి చేరింది. అలాగే... ఆదివారం 410 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 20453కి చేరింది.

ఇటలీలో కొత్తగా 3047 మందికి కరోనా రాగా... మొత్తం కేసుల సంఖ్య 178972గా ఉంది. ఆదివారం 433 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 23660గా ఉంది.

ఇక ఫ్రాన్స్ (1101), జర్మనీ (1460), బ్రిటన్ (5850), టర్కీ (3977), రష్యా (6060), ఇరాన్ (1343), కెనడా(1673) దేశాల్లో ఇలా కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఓవరాల్‌గా చూస్తే... యూరప్ దేశాల్లో, అమెరికాలో కరోనా కంట్రోల్ అయితే... దాదాపు 90 శాతం కరోనా కంట్రోల్ అయిపోయినట్లే అనుకోవచ్చు. ఇలా జరగాలంటే... ఆయా దేశాలు మరింత బలంగా అదుపుచేసే చర్యలు చేపట్టడం ప్రపంచానికి అవసరం.

భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 16116కి చేరింది. వారిలో 2302 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. ఇక మృతుల సంఖ్య 500 దాటి 519కి చేరింది.

తెలంగాణలో కొత్తగా 18 కేసులు నమోదవడంతో... మొత్తం కేసులు 858కి చేరాయి. వారిలో 186 మంది డిశ్చార్జి అయ్యారు. అందువల్ల ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్నవారి సంఖ్య 651గా ఉంది. వారందరికీ వైరస్ అంతంతమాత్రంగానే ఉంది సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక మరణాల సంఖ్య 21గా ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో 44 కొత్త కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. ఐతే, వాటిలో 65 మంది రికవరీ అయ్యి, డిశ్చార్జి అయ్యారు. మరో 17 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది. ప్రస్తుతం 565 మంది కరోనాతో బాధపడుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: April 20, 2020, 5:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading