29 లక్షలు దాటిన కరోనా కేసులు... మృతులు 2 లక్షలకు పైనే...

Corona Lockdown | Corona Update : కరోనా ప్రపంచ దేశాల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. యూరప్‌లో కాస్త నెమ్మదిస్తుంటే... ఇతర దేశాల్లో విజృంభిస్తోంది.

news18-telugu
Updated: April 26, 2020, 5:43 AM IST
29 లక్షలు దాటిన కరోనా కేసులు... మృతులు 2 లక్షలకు పైనే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : కంటికి కనిపించని... సరైన ఆకారమే లేని అతి చిన్న ప్రాణితో యావత్ ప్రపంచం పోరాడాల్సి వస్తోంది. తను జీవించడానికి ఇంకెక్కడా ప్లేస్ లేనట్లు ఆ వైరస్ వచ్చి మనుషుల్లో దూరడం లెక్కలేనన్ని సమస్యలకు కారణం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో కేసుల సంఖ్య 2917552కి చేరింది. వీటిలో 834525 కేసులు రికవరీ అయ్యాయి కాబట్టి... ప్రస్తుతం 1879908 మంది కరోనాతో బాధపడుతున్నట్లు లెక్క. వీరిలో 1821730 మందికి కరోనా పెద్దగా లేనట్లే. ఐతే... 58178 మందికి మాత్రం కరోనా తీవ్రంగా ఉంది. వారంతా ICUలో వెంటిలేటర్లతో ఉన్నట్లు లెక్క.

అమెరికాలో శనివారం 33911 కేసులు నమోదవడం వల్ల మొత్తం కేసులు 959143కి చేరాయి. అలాగే... శనివారం 2035 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 54228కి చేరాయి. ఒకే రోజు 2వేల మందికి పైగా చనిపోవడం మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే... శనివారం ప్రపంచంలో మొత్తం మరణాలు... 6020 ఉండగా... వాటిలో 33 శాతం అమెరికాలోనే నమోదవ్వడాన్ని బట్టీ... అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం గ్రహించవచ్చు.

ఇక స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ వంటి దేశాల్లో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది గానీ... కొత్త కేసుల నమోదు మాత్రం తగ్గట్లేదు. ఈ ఆరు దేశాల్లో కొత్త కేసులు 17వేలకు పైగా నమోదయ్యాయి. అందువల్ల కరోనా ఈ దేశాల్ని ఎప్పటికల్లా వదిలేస్తుందన్నది అంతుబట్టడం లేదు.

చైనాలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న కేసులు జస్ట్ 838 మాత్రమే. అవి కూడా తగ్గిపోతే... కరోనా ఫ్రీ కంట్రీగా చైనా నిలుస్తుంది. కాకపోతే శనివారం కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి.

ఇండియాలో ప్రస్తుతం 24942 కేసులు ఉండగా... వీరిలో 111 మంది విదేశీయుల కేసులున్నాయి. మొత్తం ఇప్పటివరకు 5210 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మరణాల సంఖ్య 779కి చేరింది.

కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌... తెలంగాణను దాటేసింది. కొత్తగా 61 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1016కి చేరింది. ఈ కేసుల్లో అత్యధికంగా 66 శాతం కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే నమోదయ్యాయి. మృతుల సంఖ్య 31గా ఉంది.

తెలంగాణలో శనివారం కొత్తగా 7 పాజిటివ్ కేసులే రావడం మంచి విషయం. మొత్తం కేసుల సంఖ్య 990కి చేరింది. వారిలో 307 మంది డిశ్చార్జి అయ్యారు. అందువల్ల యాక్టివ్ కేసుల సంఖ్య 658గా ఉంది. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ, రేపు కూడా పరిస్థితిని సమీక్షించనుంది.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 5:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading