ప్రపంచంలో 35 లక్షలు దాటిన కరోనా కేసులు... తగ్గుతున్న మరణాలు...

ప్రపంచంలో 35 లక్షలు దాటిన కరోనా కేసులు... తగ్గుతున్న మరణాలు... (credit - WHO)

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ అంచనాలు తారుమారవుతున్నాయి. తగ్గినట్టే తగ్గుతూ మళ్లీ విజృంభిస్తోంది.

 • Share this:
  Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంటే... మరణాల సంఖ్య తగ్గుతోంది. కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా అమెరికా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 80952 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 3562324కి చేరింది. ఆదివారం 3433 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 248096కి చేరింది. గత మూడు వారాలుగా మరణాల సంఖ్య 5వేలకు పైనే ఉంది. ఐదు రోజుల నుంచి మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశం.

  ప్రస్తుతం ప్రపంచంలో 1153071 మంది కరోనా నుంచి కోలుకోగా... ఇప్పుడు 2161157 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో 50043 మందికి కరోనా తీవ్రంగా ఉంది. మూడు వారాల కిందట ఈ సంఖ్య 55వేలకు పైనే ఉండేది. క్రమంగా ఇది కూడా తగ్గుతోంది.

  కరోనాకు అతి పెద్ద హాట్‌స్పాట్‌గా మారిన అమెరికాలో ఆదివారం 26514 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1187288కి చేరింది. అలాగే ఆదివారం 1124 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 68568కి చేరింది. ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల్లో అమెరికావి దాదాపు 28 శాతం ఉన్నాయి.

  ఆమెరికా తర్వాత... రష్యాలో నిన్న 10633 కేసులు నమోదయ్యాయి. అలాగే... బ్రెజిల్‌లో 4588, బ్రిటన్‌లో 4339 కేసులొచ్చాయి. ఇక స్పెయిన్, ఇటలీ, టర్కీ, కెనడా, పెరు, ఇండియా, ఈక్వెడార్, సౌదీ అరేబియా, మెక్సికో, పాకిస్థాన్, చిలీ దేశాల్లో రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదివరకు ఈ లిస్ట్ తక్కువగా ఉండేది. అంటే... కరోనా మరిన్ని దేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తోందని అర్థమవుతోంది.

  భారత్‌లో పాలకుల అంచనాలు తలకిందులవుతున్నాయి. చూస్తుండగానే... కేసుల సంఖ్య 40వేలు దాటింది. ఆదివారం ఏకంగా 2487 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 40,263కి చేరింది. డిశ్చార్జి అయిన వాళ్లను పక్కన పెడితే... ప్రస్తుతం 28,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం 83 మంది చనిపోవడంతో... మరణాల సంఖ్య 1306కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశారు. మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఆ తర్వాత గుజరాత్ (5054) , ఢిల్లీ (4122), మధ్యప్రదేశ్ (2846), రాజస్థాన్ (2770), తమిళనాడు (2757)లో 2వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

  తెలంగాణలో ఆదివారం 21 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 20 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1082కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 508 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 29 మంది చనిపోయారు.

  ఆంధ్రప్రదేశ్‌లో వారం నుంచి రోజూ 60 కేసుల దాకా నమోదవుతున్నాయి. తాజాగా 54 మందికి కరోనా సోకినట్లు తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 1583కి చేరింది. వాటిలో 488 మంది ఆల్రెడీ డిశ్చార్జి అయ్యారు. 33 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1062గా ఉంది.
  Published by:Krishna Kumar N
  First published: