news18-telugu
Updated: April 28, 2020, 5:44 AM IST
30 లక్షలు దాటిన కరోనా కేసులు... అమెరికాలో 10 లక్షలకు పైనే...
Corona Lockdown | Corona Update : ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 65819 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 3059081కి చేరింది. అలాగే సోమవారం 4287 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 211202కి చేరింది. ఐతే... గత నాలుగు వారాలుగా మృతుల సంఖ్య 5వేలకు పైనే ఉంది. ఈ వారం మాత్రం 4వేల దగ్గర్లో ఉంటుండటం ఒకింత ఉపశమనం అనుకోవచ్చు. అలాగే అమెరికాలో మృతులు, కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుతుంటే... ఇతర దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఐతే... అమెరికాలో ఇలాంటి పాజిటివ్ సంకేతాలు రావడం హర్షదాయకం.
ప్రస్తుతం 919746 మంది రికవరీ అవ్వడం వల్ల 1928133 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో 56281 కేసుల్లో పేషెంట్లు ICUలో ఉన్నారు. ఐతే... ఆదివారంతో పోల్చితే... ఈ కేసుల సంఖ్య దాదాపు వెయ్యి దాకా తగ్గింది. ఇది కూడా మంచి పరిణామమే.
అమెరికాలో సోమవారం 20883 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 1008043కి చేరింది. అలాగే... సోమవారం 1236 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 56649కి చేరింది. ఓవరాల్గా చూస్తే... మూడ్రోజులుగా అమెరికా కొద్దిగా కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలాగని ఇక అమెరికాలో కరోనా కంట్రోల్ అయిపోతున్నట్లే అనుకోవడానికి అప్పుడే వీల్లేదనుకోవచ్చు.
స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, టర్కీ, ఇరాన్, రష్యా, బ్రెజిల్, కెనడా, ఇండియా, పెరు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఆశ్చర్యకర విషయమేంటంటే... చైనా నుంచి యూరప్ వచ్చిన కరోనా... పక్కనే ఉన్న రష్యాకు పాకకుండా... అమెరికాకు వెళ్లింది. అలాంటి కరోనా... ఇప్పుడు మాత్రం రష్యాపై విరుచుకుపడుతోంది. గత ఐదు రోజులుగా రష్యాలో... 3వేలకు పైగా కేసులు నమోదవుతుంటే... సోమవారం ఒక్కరోజే 6198 కేసులొచ్చాయి. ఫలితంగా మొత్తం కేసులు 87147కి చేరాయి. అలాగే సోమవారం 47 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 794కి చేరింది. చూస్తుంటే... అమెరికా తర్వాత... రష్యాలో కరోనా జోరుగా ఉన్నట్లు ఇప్పుడు కనిపిస్తోంది. రష్యా తర్వాత బ్రిటన్లో 4వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి. అందువల్ల కరోనా కథ ముగిసినట్లే అనుకోవడానికి ఛాన్స్ కనిపించట్లేదు.
ఇండియాలో కరోనా మెల్లమెల్లగా పెరుగుతోంది. తాజాగా కేసుల సంఖ్య 28380కి చేరగా... వాటిలో 6362 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. అలాగే మృతుల సంఖ్య 886కి చేరింది.
ఇక ఏపీలో కేసుల సంఖ్య 1177కి చేరగా 237 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది మృతి చెందారు. అందువల్ల 911 యాక్టివ్ కేసులున్నాయి. శ్రీకాకుళంలో మరో కేసు పెరిగి ఆ జిల్లాలో మొత్తం కేసులు 4 అయ్యాయి.తెలంగాణలో సోమవారం 2 కేసులే నమోదవ్వడంతో.. మొత్తం కేసులు 1003కి చేరాయి. 332 మంది డిశ్చార్జి అవ్వగా... 25 మంది మృతి చెందారు. 646 యాక్టివ్ కేసులున్నాయి.
Published by:
Krishna Kumar N
First published:
April 28, 2020, 5:44 AM IST