40 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కోలుకుంటున్న ప్రపంచ దేశాలు..

40 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కోలుకుంటున్న ప్రపంచ దేశాలు..

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలకు చేరువవుతోంది. ప్రస్తుతం 39,15,641 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 • Share this:
  కరోనా మహమ్మారి దెబ్బకు అస్తవ్యస్తమైన ప్రపంచ దేశాలు.. మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాయి. దేశాలన్నీ లాక్‌డౌన్ విధించుకుంటూ కఠిన చర్యలు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తి, మరణాలు తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో పరిస్థితి దారుణంగానే ఉన్నా, మిగతా దేశాల్లో పరిస్థితి కాస్త కుదుటపడుతోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలకు చేరువవుతోంది. ప్రస్తుతం 39,15,641 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 2,70,683 మరణాలు చోటుచేసుకున్నాయి. 13,41,085 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా సమాచారం ప్రకారం 23,03,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 48,960 మంది పరిస్థితి విషమంగా ఉంది.

  కాగా, అమెరికాలో నిన్న ఒక్క రోజే 2,129 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 600, యూకేలో 539, ఇటలీలో 274, స్పెయిన్‌లో 213, మెక్సికోలో 197, ఫ్రాన్స్‌లో 178, కెనడాలో 176, జర్మనీలో 117 మంది చనిపోయారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు