ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా... అమెరికాలో 7లక్షలు దాటిన కేసులు...

Corona Lockdown | Coronaupdate : గతవారం కాస్త కట్టడి అయినట్లు కనిపించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ మరింత ఎక్కువగా విజృంభిస్తోంది.

news18-telugu
Updated: April 18, 2020, 5:43 AM IST
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా... అమెరికాలో 7లక్షలు దాటిన కేసులు...
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా... అమెరికాలో 7లక్షలు దాటిన కేసులు...
  • Share this:
Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు అర్థ కావట్లేదు. తగ్గినట్లే తగ్గి... మళ్లీ మరింత ఎక్కువగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో తగ్గుతోంది అనుకుంటున్న తరుణంలో... మళ్లీ అక్కడ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2248037కి చేరింది. వీరిలో 570792 మంది కోలుకున్నారు. మరో 1523119 మంది వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 1466152 మందికి వైరస్ తక్కువగానే ఉంది. 56967 మందికి మాత్రం వైరస్ తీవ్రంగా ఉంది. ఇక మృతుల సంఖ్య 154126కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 85670 కేసులు నమోదయ్యాయి. అలాగే... శుక్రవారం ఒక్కరోజే 8653 మంది చనిపోయారు.

అమెరికాలో కరోనా ఏమాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. శుక్రవారం 31631 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 709201కి చేరింది. అలాగే... శుక్రవారం 2516 మంది చనిపోవడంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 37135కి చేరింది.

ఇక స్పెయిన్‌లో కొత్తగా 5891 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 190839 అయ్యింది. అలాగే.. శుక్రవారం 687 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 20002కి చేరింది.

ఇటలీలో కొత్తగా 3493 కేసులు నమోదయ్యాయి. అలాగే... జర్మనీలో కొత్తగా 3699, బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా 5599 కేసులు నమోదయ్యాయి. ఇలా కొత్త కేసులు పెరిగిపోవడం షాకింగ్ విషయమే.

చైనా ఇన్నాళ్లూ ప్రజలకు నిజం చెప్పలేదని తాజాగా తెలిసింది. చైనా తన కరోనా లెక్కల్ని సవరించింది. ఫలితంగా తాజా లెక్కల ప్రకారం... శుక్రవారం కొత్తగా 325 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 82692కి చేరింది. అలాగే... కొత్తగా 1290 మరణాలు సంభవించినట్లు లెక్కలు మార్చగా... మొత్తం మరణాల సంఖ్య 4632కి చేరింది.

ఇక ఇండియాలో ప్రస్తుతం 13835 కేసులు ఉండగా... 1767 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 452కి చేరింది.

తెలంగాణలో కొత్తగా మరో 66 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 766కు పెరిగింది. ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.ఏపీలో కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 572కి పెరిగింది. ఇప్పటివరకూ 38 మంది డిశ్చార్జి అయ్యారు. 14 మంది చనిపోయారు.

ఓవరాల్‌గా చూస్తే... ప్రపంచ దేశాలు... ముఖ్యంగా యూరప్ దేశాలు కరోనా వైరస్‌ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. కాస్త కేసులు తగ్గగానే... లాక్‌డౌన్ సడలింపులు చేస్తుండటంతో... మళ్లీ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. చైనా ఇన్నాళ్లూ తప్పుడు లెక్కలు ఎందుకు చెప్పింది? ఎందుకు వాస్తవాల్ని దాచిపెట్టిందన్నది తేలాల్సిన అంశం. చైనా ఇచ్చిన తప్పుడు డేటా ఆధారంగా... చర్యలు చేపట్టిన ప్రపంచ దేశాలకు ఇప్పుడు... అంచనాలన్నీ తప్పయ్యాయి.
Published by: Krishna Kumar N
First published: April 18, 2020, 5:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading