గుడ్‌న్యూస్... లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తున్న జర్మనీ...

Corona Lockdown | Corona Update : యూరప్‌లో కరోనా వైరస్‌ని సమర్థంగా ఎదుర్కొన్న దేశంగా జర్మనీ గుర్తింపు పొందింది.

news18-telugu
Updated: April 20, 2020, 1:20 PM IST
గుడ్‌న్యూస్... లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తున్న జర్మనీ...
గుడ్‌న్యూస్... లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తున్న జర్మనీ... (credit - twitter - Bloomberg Opinion)
  • Share this:
Corona Lockdown | Corona Update : జర్మనీలో లాక్‌డౌన్ సడలిస్తే... మనకు గుడ్ న్యూస్ ఎందుకవుతుందంటే... ప్రస్తుతం కరోనా పోరాటంలో ఏ దేశం ఏ విజయం సాధించినా... అది ప్రపంచ విజయం కిందే లెక్క. పైగా జర్మనీలో నిబంధనలు సడలిస్తే... అది మిగతా యూరప్ దేశాల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. తద్వారా ఆ దేశాలు కూడా కరోనాపై జర్మనీ బాటలో ముందుకెళ్తాయి. ప్రస్తుతం జర్మనీలో 145742 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా... వాటిలో 91500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 మందికి మాత్రమే కరోనా సీరియస్‌గా ఉంది. మిగతావాళ్లకు కరోనా తగ్గిపోయే అవకాశాలు 99 శాతం ఉన్నాయి. జర్మనీలో కరోనా మృతుల సంఖ్య 4642గా ఉంది. ప్రతి 100 మంది కరోనా సోకిన వారిలో అక్కడ ఐదుగురు మాత్రమే చనిపోతున్నారు. అదే ఇటలీలో అయితే 33 మంది, స్పెయిన్‌లో 21 మంది, అమెరికాలో 36 మంది చొప్పున చనిపోతున్నారు. ఈలెక్కల ప్రకారం చూస్తే... జర్మనీ మిగతా దేశాల కంటే... కరోనా కట్టడి విషయంలో చాలా మెరుగ్గా ఉన్నట్లే.

పరిస్థితులు మెరుగవ్వడంతో... జర్మనీ ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా సోమవారం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కొన్ని ఏరియాల్లో చిన్న షాపులు తెరచుకోవచ్చని చెప్పింది. జర్మనీలో అధికార, ప్రతిపక్ష నేతలంతా ఒకే మాటమీద ఉన్నారు. కరోనా కంట్రోల్ అయ్యిందని ప్రకటించారు.

ఇకపై జర్మనీలో పూల దుకాణాలు, ఫ్యాషన్ స్టోర్లు, అంటే... 8600 చదరపు మీటర్ల లోపు ఉండే షాపులన్నీ తెరచుకున్నట్లే. వాటిలోకి ఇకపై ప్రజలు సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ వెళ్లవచ్చు. నెల కిందట జర్మనీ లాక్‌డౌన్ విధించినప్పుడు... అత్యంత కఠినంగా అమలుచేసింది. ఇప్పుడు జర్మనీలోని 16 రాష్ట్రాలు... వేర్వేరు ప్రదేశాల్లో నిబంధనల్ని సడలిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం... ఇంకొన్ని రోజులు లాక్‌డౌన్ కఠినంగానే ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

ప్రపంచంలో కరోనాను గెలిచిన దేశాలుగా దక్షిణ కొరియా, చైనా, జర్మనీ, తైవాన్ ఇలా కొన్ని ఉన్నాయి. ఆ దేశాలు ఎలా ఎదుర్కొన్నాయో... మిగతా దేశాలు గమనిస్తున్నాయి. మన భారత దేశం కూడా ఈ విజేతల లిస్టులో ఉన్నప్పటికీ... చాలా దేశాలు భారత్‌లో ఇంకా కరోనా పూర్తిగా రాలేదనీ... మున్ముందు అది పెరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాయి. కరోనా పెరిగేటప్పుడు భారత్ ఎలా ఎదుర్కొంటుందన్నదాన్ని బట్టీ... భారత్‌ను విజేతగా నిర్ణయించాలో లేదా అన్నది డిసైడ్ చేసుకోనున్నాయి.

కరోనాపై గెలిచిన దేశాల్లో ఏ ఒక్క దాంట్లోనూ కరోనాకి మందు లేదు. అన్నింటి మొదటి విజయ రహస్యం లాక్‌డౌనే. రెండో విజయరహస్యం... ఎక్కువ టెస్టులు. ఈ రెండు సూత్రాలతోనే అవి విజయం సాధించాయి. భారత్... ఇప్పటికే లాక్‌డౌన్ ద్వారా కరోనాను నిలువరించింది. కాబట్టి... ఎక్కువ టెస్టులు కూడా జరిపిస్తే... రెండో విధంగా కూడా భారత్ విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌ను "గ్రేట్ మేమ్, శభాష్ మేమ్" అంటూ మెచ్చుకుంటున్నాయి.
Published by: Krishna Kumar N
First published: April 20, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading