దేశంలో కరోనా విజృంభణ... కొత్తగా 6535 కేసులు... 146 మరణాలు...

Corona Lockdown | Corona Update : వరుసగా నాలుగో రోజు దేశంలో 6వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. పరిస్థితి చేయిదాటుతున్నట్లు కనిపిస్తోంది.

news18-telugu
Updated: May 26, 2020, 11:02 AM IST
దేశంలో కరోనా విజృంభణ... కొత్తగా 6535 కేసులు... 146 మరణాలు...
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ జూన్ 3 వరకు కొనసాగుతుంది.
  • Share this:
Corona Lockdown | Corona Update : దేశంలో కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉన్నా... కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ఆగట్లేదు. కొత్తగా 6535 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 145380కి చేరింది. 24 గంటల్లో 146 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 4167కి చేరింది. మొత్తం కేసుల్లో 60490 మంది రికవరీ అవ్వగా ప్రస్తుతం 80722 మంది ఐసోలేషన్ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఐతే... ఇండియా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ కేసులున్న దేశాల్లో 10 స్థానంలో ఉండగా... ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది.

దేశంలో కరోనా లెక్కలు ఇంకా ఎక్కడి దాకా వెళ్లిపోతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్‌లో 20 లక్షలకు చేరుకుంటాయని CCMB అంచనా వెయ్యడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50 వేలు దాటి... 52667కి చేరింది. అలాగే... తమిళనాడులో 17082 కేసులు, గుజరాత్‌లో 14460 కేసులు, ఢిల్లీలో 14053 కేసులుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ రాష్ట్రాలతోపాటూ... మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా కేసుల సంఖ్య 10 వేల వైపుగా పరుగులు పెడుతోంది.

మన కంటే ఎక్కువ జనాభా ఉండే చైనాలో కరోనా కేసుల సంఖ్య 82వేల దగ్గర ఆగింది. కానీ మన దేశంలో దానికి డబుల్ డిజిట్ చేరుకుంటోంది. ఏం చేస్తే కరోనా ఆగుతుందన్నది తేలట్లేదు. మొదట్లో ఎండ వల్ల కరోనా ఇండియాలో రాదని అనుకున్నారు. ఎండలు పెరిగినా కరోనా తగ్గలేదు. మరో రెండు వారాల్లో ఎండాకాలం ముగిసిపోయేలా ఉంది. ఆ తర్వాత వర్షాలొస్తే... చల్లదనంలో కరోనా వైరస్ మరింత వేగంగా పెరుగుతుంది. అందువల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరికి వాళ్లు అప్రమత్తంగా ఉంటూ... తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సమస్యకు పరిష్కారంగా కనిపిస్తోంది.

దేశంలో కరోనా కేసుల వివరాలు
First published: May 26, 2020, 9:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading