లాక్‌డౌన్ రూల్స్ సడలించవద్దు... ప్రపంచానికి WHO హెచ్చరిక...

Corona Lockdown | Corona Update : చాలా దేశాల్లో లాక్‌డౌన్ అన్నది మాటలకే పరిమితం అవుతోంది. అందుకే WHO మరోసారి వార్నింగ్ ఇచ్చింది.

news18-telugu
Updated: May 2, 2020, 7:18 AM IST
లాక్‌డౌన్ రూల్స్ సడలించవద్దు... ప్రపంచానికి WHO హెచ్చరిక...
లాక్‌డౌన్ రూల్స్ సడలించవద్దు... ప్రపంచానికి WHO హెచ్చరిక...
  • Share this:
Corona Lockdown | Corona Update : సోషల్ డిస్టాన్సింగ్, లాక్‌డౌన్... ఈ రెండూ ప్రస్తుతం కరోనా వైరస్‌ని కంట్రోల్ చేస్తున్న అస్త్రాలు. ఈ రెండూ బాగా పాటిస్తున్న దేశాల్లో కరోనా కంట్రోల్‌లో ఉంటుంటే... సరిగా పాటించని అమెరికా లాంటి దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఐతే... భారత్ లాంటి దేశాలు... లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే... నిబంధనల్ని సడలిస్తుండటంతో... ఇది ప్రమాదకరం అని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). వైరస్ తిరిగి పుంజుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే దేశాలు... ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలనీ... ఇష్టమొచ్చినట్లు సడలింపులు ఇచ్చేయవద్దని అంటోంది.

కరోనా అప్పుడే వదిలేలా లేదన్న WHOలోని ఎమర్జెన్సీస్ విభాగ నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్... సడలింపులు ఇస్తున్న చోట... చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. సూడాన్, సౌత్ సూడాన్, సిరియా, యెమెన్, ఆఫ్ఘనిస్థాన్, సియర్రా లియోన్, వంటి దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగినట్లు చెప్పారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ డిస్టాన్స్ పాటించాలనీ, అలాగే... శుభ్రత విషయంలో రాజీ పడొద్దని కోరారు.

అమెరికా ఆరోపిస్తున్నట్లు.... చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ పుట్టిందా? అన్న ప్రశ్నకు మైక్ ర్యాన్ కాదనే సమాధానం ఇచ్చారు. వైరస్ తీరును చూశాక... అది సహజంగానే పుట్టినట్లు శాస్త్రవేత్తలు తేల్చారని చెప్పారు.

చైనాలో మాత్రం కరోనా వైరస్ కంట్రోల్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం అక్కడ 557 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 1 కేసు మాత్రమే నమోదైంది. ఇప్పుడు చైనా ఎలాంటి లాక్‌డౌనూ విధించలేదు. అక్కడ అంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఐతే... సోషల్ డిస్టాన్స్ మాత్రం పాటిస్తున్నారు.
First published: May 2, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading