యాంటీబాడీస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ ప్రకటన... ఆశలపై నీళ్లు...

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్‌కి మందు లేకపోయినా... యాంటీబాడీస్ ఉన్నాయి కదా అని అంతా కాన్ఫిడెన్స్ పెంచుకుంటుంటే... వాటిపై నమ్మకం పెట్టుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.

news18-telugu
Updated: April 18, 2020, 6:08 AM IST
యాంటీబాడీస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ ప్రకటన... ఆశలపై నీళ్లు...
ప్రతకాత్మకచిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్‌కి మందు లేదు కాబట్టి... మన శరీరంలో ఉండే యాంటీబాడీస్ (వ్యాధి నిరోధక శక్తి మూలాలు) మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడతాయనీ, కరోనా నయమైన వారి బాడీ నుంచి యాంటీ బాడీస్ సేకరించి... మిగతా కరోనా పేషెంట్లకు వాటిని ఎక్కిస్తే... వారికి కూడా కరోనా నయం అవుతుందని ఇప్పటివరకూ డాక్టర్లు చెబుతుంటే... అలాంటి ఆశలు పెట్టుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రక్తంలో ఉండే యాంటీ బాడీస్ వల్ల... ఒకసారి కరోనా వైరస్ సోకి, నయమైన వారికి మళ్లీ కరోనా సోకదనేందుకు గ్యారెంటీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రముఖ ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ ర్యాన్ తెలిపారు.

చాలా మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు... తమ యాంటీ బాడీస్ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారనీ... కానీ... ఇలా వారి యాంటీ బాడీస్‌ని కరోనా పేషెంట్లకు ఎక్కించడం వల్ల కలుగుతున్న ప్రయోజనం చాలా తక్కువగానే ఉంటోందని ర్యాన్ తెలిపారు.

ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ... ఇప్పుడీ యాంటీబాడీస్‌పై దృష్టి పెట్టాయనీ, వీటిని సేకరించే పనిలో పడ్డాయనీ చెబుతున్న ర్యాన్... ఐతే... ఇలా చేయడం వల్ల కరోనా వైరస్‌ మాత్రం పోదని ఆయన అన్నారు. కరోనా వైరస్ పోవడానికి ఈ చర్య పరిష్కారం కాదని ర్యాన్ అంటున్నారు. ఆయన చెప్పేదాన్ని బట్టీ చూస్తుంటే... కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ మాత్రమే సరైన పరిష్కారం అనుకోవాల్సి వస్తోంది.
First published: April 18, 2020, 6:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading