8 పవర్‌ఫుల్ వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి... WHO ప్రకటన...

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్‌ జోరు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది. మరణాల సంఖ్య కూడా తగ్గుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

news18-telugu
Updated: May 12, 2020, 11:40 AM IST
8 పవర్‌ఫుల్ వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి... WHO ప్రకటన...
(credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : సరైన టైమ్ చూసి... అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు నిధులు ఆపేశారు. ఇప్పుడు ఇదే WHOకి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే... ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ని చంపే... కీలక వ్యాక్సిన్ల తయారీపై పెట్టుబడి పెట్టేందుకు WHOకి నిధుల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం 7 నుంచి 8 టాప్ వ్యాక్సిన్ల తయారీ జోరుగా ఉందనీ... వీటికి నిధులు కావాల్సి ఉందని WHO డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ తెలిపారు. ఈ టాప్ వ్యాక్సిన్లలో కనీసం ఒక్కటైనా కరోనాకి బ్రేక్ వెయ్యగలదని WHO నమ్ముతోంది. దేన్ని తయారు చెయ్యాలన్నా... 12 నుంచి 18 నెలలు పడుతుందని టెడ్రోస్ అన్నారు.

గత వారం 40 దేశాలు, సంస్థలు, బ్యాంకులూ..... రూ.60682 కోట్లు WHOకి ఇచ్చాయి. ఆ నిధులతోనే ఇప్పుడు వ్యాక్సిన్ల తయారీ చేపడుతున్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఐతే... టాప్ 8 వ్యాక్సిన్లను ఏయే కంపెనీలు తయారుచేస్తున్నాయో ఆయన చెప్పలేదు. మొత్తం 400 మంది శాస్త్రవేత్తలు... వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారని తెలిపారు.త్వరగా వ్యాక్సిన్ తయారవ్వాలంటే... మరిన్ని నిధులు కావాల్సి ఉంటుందని టెడ్రోస్ చెప్పారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తయారుచెయ్యాలి కాబట్టి... మరిన్ని నిధులు అవసరం అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 100కు పైగా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. వాటిలో 8 వ్యాక్సిన్లు మంచి ఫలితాలు చూపిస్తున్నాయని టెడ్రోస్ అన్నారు.అత్యంత తేలిగ్గా వ్యాపిస్తున్న కరోనాను తక్కువ అంచనా వెయ్యొద్దన్న టెడ్రోస్... ప్రపంచ దేశాలన్నీ ఆరోగ్యంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఇకనైనా ప్రయత్నించాలన్నారు.
Published by: Krishna Kumar N
First published: May 12, 2020, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading