Unlock 1 : ఆధార్ ఉంటేనే హెయిర్ కట్... కొత్త రూల్స్ పాటించాల్సిందే...

Corona Lockdown | Corona Update : కరోనా తర్వాత ప్రతీదీ ఓ పద్ధతి ప్రకారం జరగాలనుకుంటున్న కేంద్రం... ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తెస్తోంది.

news18-telugu
Updated: June 2, 2020, 1:05 PM IST
Unlock 1 : ఆధార్ ఉంటేనే హెయిర్ కట్... కొత్త రూల్స్ పాటించాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : జుట్టు బాగా పెరిగిందా... హెయిర్ కట్ చేయించుకోవాలని అనుకుంటున్నారా... ఐతే... ఆధార్ కార్డ్ వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. కటింగ్ అంటే... ఇన్నాళ్లూ ఒక ఎత్తు... ఇప్పుడు మరో ఎత్తు. తాజాగా తమిళనాడులో సెలూన్లకు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం... సెలూన్‌ని వెళ్లిన వారంతా... తమ పేరు, అడ్రెస్, మొబైల్ నంబర్లు, ఆధార్ కార్డ్ ఐడీ నంబర్ చెప్పాల్సి ఉంటుంది. సెలూన్‌కి వెళ్లాలంటే డబ్బులుంటే చాలవా... ఇవన్నీ ఎందుకూ అని అనిపిస్తే తప్పులేదు. సమస్యేంటంటే.. సెలూన్‌లో పనిచేస్తున్న ఎవరికైనా కరోనా సోకితే... ఆ వ్యక్తి నుంచి కస్టమర్లకు ఎవరికైనా సోకిందా అన్నది తెలుసుకోవడం కోసం కస్టమర్ల వివరాలన్నీ తీసుకుంటున్నారు.

ఇకపై తమిళనాడులో సెలూన్లు, బ్యూటీ పార్లర్లూ, స్పాలూ... ఓ రిజిస్టర్ ఉంచుకోవాలి. అందులో కస్టమర్ల వివరాలన్నీ రాయాలి. ముఖ్యంగా ఆధార్ ఐడీ నంబర్ తప్పనిసరి. ఇదే కాదు... ఇలాంటి చాలా కండీషన్లు ఉన్నాయి.

- సోషల్ డిస్టాన్స్ తప్పనిసరి.
- సీట్లలో 50 శాతం మాత్రమే నింపుకోవచ్చు. సీట్ల మధ్య ఖాళీ ఉండాలి,
- ఒక కస్టమర్‌కి వాడిన బ్లేడ్, మరో కస్టమర్‌కి వాడకూడదు. (ఇది అమల్లో ఉన్నదే)
- వాడిన బ్లేడును జాగ్రత్తగా పారేయాలి. తొలగించిన జుట్టు, ఫేస్ ప్యాక్ లను కూడా జాగ్రత్తగా పారేయాలి.
- డిస్పోజబుల్ టవల్స్ మాత్రమే వాడాలి. ఒక కస్టమర్‌కి వాడిన టవల్ మరొకరికి వాడాలంటే.. దాన్ని ఉతికిన తర్వాతే వాడాలి.- ఏ పరికరాలు వాడినా... వాటిని ముందుగా శానిటైజర్‌తో శుభ్రం చేసిన తర్వాతే వాడాలి.
- ఏసీ ఆన్ చెయ్యకూడదు. కిటీకీలన్నీ తెరచి ఉంచాలి. లోపలికి గాలి వచ్చేలా చెయ్యాలి.
- చైర్లు, టేబుళ్లు, డోర్లు, అద్దాలు అన్నీ... లైజోల్ లేదా హైపోక్లోరైట్ కలిపిన మిశ్రమంతో రోజుకు ఐదుసార్లు శానిటైజ్ చెయ్యాలి.
- పనిచేసేవారికి పేపర్ నాప్కిన్లు ఇవ్వాలి. వాళ్లకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
- పని మొదలుపెట్టేటప్పుడు, పని పూర్తయ్యాక... చేతులకు శానిటైజర్ రాసుకోవాలి. మాస్క్ ధరించాలి, గ్లోవ్స్ ధరించాలి.
- పనిచేసేవారు తమ ముక్కు, నోరు, కళ్లను ముట్టుకోకూడదు.

ఇవి ప్రస్తుతం తమిళనాడుకే పరిమితమైనా... ముంబైలో ఎవరి టవల్ వారే తెచ్చుతోవాలనే ఓ కండీషన్ పెట్టారు. అన్ని రాష్ట్రాలూ దాదాపు ఇలాంటి రూల్స్ పెడుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: June 2, 2020, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading