త్వరలో చైనాకి అమెరికా నిపుణులు... కరోనా వైరస్ ఎలా పుట్టిందో పరిశోధన...

Corona Lockdown | Corona Update : అప్పుడే అయిపోలేదు అసలు కథ ముందుంది అన్నట్లుంది ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తుంటే.

news18-telugu
Updated: April 20, 2020, 12:03 PM IST
త్వరలో చైనాకి అమెరికా నిపుణులు... కరోనా వైరస్ ఎలా పుట్టిందో పరిశోధన...
ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుందని, కుటుంబాలను విడదీస్తుందని భారతీయుల తరపున దావా వేసిన న్యాయవాది వాస్డెన్ బనియాస్ కోర్టుకు తెలిపారు.
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ అనేది సృష్టిలో పుట్టింది కాదనీ... ల్యాబ్‌లో తయారుచేసినదని ఫ్రాన్స్‌కి చెందిన ఓ వైరాలజీ శాస్త్రవేత్త అనడంతో... అమెరికా అధ్యక్షుడు ట్రంప్... చైనాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి చాలా ఆరోపణలు విన్నానన్న ఆయన... "నాకెక్కడో తేడా కొడుతోంది... తేలాల్సిందే" అంటూ... త్వరలోనే అమెరికాకు... నిపుణుల టీమ్‌ని పంపబోతున్నట్లు తెలిపారు. ఈ టీమ్... చైనాలోని వుహాన్‌కి వెళ్లి అక్కడ కరోనా వైరస్ ఎలా వ్యాపించింది, ఎందుకు వ్యాపించింది, అసలు కరోనా వైరస్ ఎలా పుట్టింది? ల్యాబ్‌లో అది తయారయ్యే ఛాన్స్ ఉందా? లేక గబ్బిలాలు లేదా పాములు లేదా ఆలుగుల నుంచి అది వచ్చిందా? అన్ని విషయాలపై పరిశోధన చెయ్యనుంది.

మామూలుగా అయితే... ఇలాంటి టీమ్స్‌ని చైనా రానివ్వదు. కానీ... పంపుతున్నది ట్రంప్ కాబట్టి... చైనా ఆపే సాహసం చెయ్యదనే అనుకోవచ్చు.

అమెరికాకు ఉన్న అనుమానపు ప్రశ్నలు :
- ప్రపంచంలో అన్ని దేశాలకూ విస్తరించిన కరోనా వైరస్... చైనాలో మాత్రం జస్ట్... వుహాన్ నగరం దాని చుట్టూ ఉన్న హ్యూబే ప్రావిన్స్‌కే ఎందుకు పరిమితం అయ్యింది?
- చైనాలో ఇప్పుడు 1000 మందే కరోనా పేషెంట్లు ఎందుకున్నారు? వైరస్‌ని అలా ఎలా కంట్రోల్ చెయ్యగలిగింది?
- బయో వార్‌లో భాగంగానే చైనా ఈ వైరస్‌ని తయారుచేసిందనే ఆరోపణలు నిజమేనా?

ట్రంప్ తాజాగా చైనాకి ఓ వార్నింగ్ ఇచ్చారు. తమ టీమ్ దర్యాప్తులో... చైనా కావాలనే ఈ వైరస్‌ని సృష్టించిందని తెలిస్తే మాత్రం... చైనాకి మామూలుగా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన "consequences" (తీవ్ర పరిణామాలు) అనే పదం వాడి... వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ప్రపంచంలో... 2407699 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 165093గా ఉంది. ఈ కేసులు, మరణాలకు పూర్తి బాధ్యత చైనాదే అని అమెరికా సహా చాలా దేశాలు భావిస్తున్నాయి. చైనా సరైన శుభ్రతా చర్యలు తీసుకోలేదనీ, వన్యమృగాల వేటపై నిషేధం సరిగా అమలు చెయ్యలేదనీ... అందువల్లే ఇలాంటి వైరస్‌లు పుట్టుకొస్తున్నాయంటూ... ఓ భారతీయుడు... అంతర్జాతీయ కోర్టులో చైనాపై కేసు వేశారు.
Published by: Krishna Kumar N
First published: April 20, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading