మరింత బలంగా మారిన కరోనా వైరస్... అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక...

Corona Lockdown | Corona Update : కొత్త కరోనా వైరస్‌పై మరిన్ని అదనపు ముళ్లు ఏర్పడ్డాయి. అవి వైరస్‌ను... మరింత తేలిగ్గా కణాల్లోకి వెళ్లేలా చేస్తున్నాయి.

news18-telugu
Updated: May 6, 2020, 7:39 AM IST
మరింత బలంగా మారిన కరోనా వైరస్... అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక...
టాప్ 12 : విజయనగరం జిల్లా (137 కేసులు)
  • Share this:
Corona Lockdown | Corona Update : మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు... మధ్యమధ్యలో... మన చేతికి ఆయుధాలు వస్తాయి. అప్పుడు మనం మరింత బలంగా మారినట్లు లెక్క... కరోనా వైరస్ విషయంలో ఇదే జరుగుతోందని అమెరికాలోని లాస్ అలామోస్ నేషనల్ లాబొరేటరీ (LANL) శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇప్పటివరకూ మనం చూస్తున్న కరోనా వైరస్... బంతిలా ఉండి... దానిపై అక్కడక్కడా కొవ్వుతో తయారైన ముళ్లు ఉన్నాయి. కొత్తగా కనిపిస్తున్న కరోనా వైరస్‌కి ఆ ముళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా రూపాంతరం (Mutation) చెందిన కొత్త వైరస్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనీ, ఇది ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది, బలమైనది అని శాస్త్రవేత్తలు తెలిపారు.

LANLను... రెండో ప్రపంచ యుద్ధకాలంలో... అణ్వాయుధాలను తయారుచేసేందుకు ఏర్పాటు చేసింది అమెరికా ప్రభుత్వం. ఈ ల్యాబొరేటరీలోని సైంటిస్టులు తాజాగా కరోనా వైరస్‌పై 33 పేజీల రిపోర్ట్ తయారుచేశారు. ప్రపంచవ్యాప్తంగా 6వేల కరోనా వైరస్‌లను పరిశీలించి... ఈ రిపోర్ట్ రూపొందించారు. ఫిబ్రవరిలో యూరప్‌లో అదనపు ముళ్లతో పుట్టిన కరోనా వైరస్... ఆ తర్వాత అమెరికా తూర్పు తీరానికి వెళ్లింది. అక్కడి నుంచి మార్చి మధ్య నాటికి... ప్రపంచమంతా పాకింది. ఇది వేగంగా వ్యాపించడమే కాదు... దీనికి.... ఒక వ్యక్తికి ఒకసారి సోకి, వ్యాధి నయమైన తర్వాత... రెండోసారి కూడా సోకేంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

కొత్త కరోనా వైరస్‌పై ఏర్పడిన అదనపు ముళ్ల వల్ల అది మరింత తేలిగ్గా... ఊపిరి తిత్తుల్లో ఉన్న శ్వాస కణాల్లోకి వెళ్లగలుగుతోంది. ప్రస్తుతం కరోనాకి వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంస్థలన్నీ... ఈ కొత్త వైరస్ రూపురేఖలు, సామర్ధ్యాన్ని వెంటనే గుర్తించి... అందుకు తగిన వ్యాక్సిన్ తయారుచెయ్యాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఇప్పటివరకూ కరోనా వైరస్ 14 సార్లు రూపాంతరం చెందింది. వీటిలో ప్రమాదకరంగా ఉన్న దాన్ని Spike D614G అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇదే ప్రపంచమొత్తం వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఈ కొత్త వైరస్ ఎందుకింత బలంగా ఉందో ఇంకా తెలియట్లేదన్నారు.
Published by: Krishna Kumar N
First published: May 6, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading