దారికొచ్చిన ట్రంప్... ఇండియా, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు...

Corona Lockdown | Coronaupdate : ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్... 24 గంటల్లో మాట మార్చారు. ప్రధాని మోదీని మెచ్చుకున్నారు.

news18-telugu
Updated: April 8, 2020, 11:01 AM IST
దారికొచ్చిన ట్రంప్... ఇండియా, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు...
డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ
  • Share this:
Corona Lockdown | Coronaupdate : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... దారికొచ్చారు. ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఆయనే.... ఆ మాట మాట్లాడి 24 గంటలు గడవకముందే... ఇండియా గొప్పదేశం అనీ, ప్రధాని మోదీతో తాను బాగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఇండియాపై ప్రతీకారం అన్నారు కదా... ఏం చేస్తారు అని అమెరికా మీడియా అడిగితే... ట్రంప్... నాలిక్కరుచుకున్నారు. అబ్బే ఏం లేదు అన్నట్లుగా మాట్లాడారు. దీనంతటికీ కారణం... తెరవెనుక జరిగిన వరుస పరిణామాలే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో... ఇదంతా జరిగింది.

కరోనా వైరస్ భారత్‌లో విస్తరిస్తుండటంతో... భారతీయులకు మందులు కావాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ... ఆమధ్య విదేశాలకు మందుల ఎగుమతులను ఆపేశారు. దాంతో అమెరికా షాక్ తింది. వెంటనే ప్రధాని మోదీకి కాల్ చేసిన ట్రంప్... తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కావాలనీ... దాన్ని ఇస్తారని ఆశిస్తున్నామనీ అన్నారు. అందుకు మోదీ వెంటనే సమాధానం ఇవ్వలేదు. మేం చేయగలిగింది మేం చేస్తామని మాత్రమే చెప్పారు.

తన మాటను పట్టించుకోలేదన్న కోపంతో ట్రంప్... వైట్‌హౌమ్ ముందు... ఇదే విషయంపై మాట్లాడుతూ... భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని మంగళవారం అన్నారు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలకే భారత్... హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా... 24 మందుల విదేశీ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీనికి కారణం ట్రంప్ బెదిరించారని కాదు... మానవతా దృక్పథంతో... ప్రపంచ దేశాలకు మందుల్ని భారతే ఎక్కువగా సరఫరా చేస్తుందన్న ఉద్దేశంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారు.

భారత ప్రకటనతో... ట్రంప్‌ ఖుషీ అయిపోయారు. అనవసరంగా నోరు జారి ప్రతీకారం అనే పెద్ద పదం వాడేసిన ట్రంప్... ఇప్పుడు ఆమెరికా మీడియా ముందు నాల్కిక్కరచుకోవాల్సి వచ్చింది. "ప్రధాని మోదీ చాలా గొప్పవారు. నిజంగా చాలా మంచివారు. నేను ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు... హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మాకు పంపితే మీకు ఇబ్బందేమీ ఉండదు కదా" అని అడిగానన్న ట్రంప్... "వారి దగ్గర ఆ మందు ఉంది. ఇండియా నుంచి అది ఎక్కువగా ఎగుమతి అవుతోంది. వాళ్లు దానిపై నిషేధం విధించారు. ఎందుకంటే అది వాళ్లకు అవసరం కాబట్టి" అని ట్రంప్... ఇప్పుడు మెత్తగా మాట్లాడి... తన తప్పును దిద్దుకున్నారు అదే సమయంలో భారత నిర్ణయంలో తప్పులేదన్న సంకేతాలు ఇచ్చారు.
Published by: Krishna Kumar N
First published: April 8, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading