కరోనాతో మరో కొత్త రోగం... పిల్లలే టార్గెట్... అమెరికాలో కలకలం...

Corona Lockdown | Corona Update : న్యూయార్క్‌లో కరోనా సోకిన వారికి అది తగ్గినా... తర్వాత మరో కొత్త అనారోగ్యం ప్రాణాలు తీస్తోంది.

news18-telugu
Updated: May 13, 2020, 7:32 AM IST
కరోనాతో మరో కొత్త రోగం... పిల్లలే టార్గెట్... అమెరికాలో కలకలం...
కరోనాతో మరో కొత్త రోగం... పిల్లలే టార్గెట్... అమెరికాలో కలకలం...
  • Share this:
Corona Lockdown | Corona Update : పిడియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్... ఇదో రకమైన కొత్త రోగం. దీన్నే కవాసాకీ వ్యాధి లేదా టాక్సి షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఈమధ్య న్యూయార్క్ లోని పిల్లలకు వ్యాపిస్తోంది. ఈ పిల్లల్లో చాలా మంది కరోనా సోకి... కోలుకున్నవారే. దాదాపు 100 మంది పిల్లలకు ఈ రోగం వ్యాపించింది. ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఈ సిండ్రోమ్‌తో చనిపోయారు. గురువారం తొలిసారిగా ఐదేళ్ల పిల్లాడు న్యూయార్క్‌లో చనిపోయాడు. ఆ చిన్నారి ఆల్రెడీ కరోనా సోకి రికవరీ అయ్యాడు. కొంత మంది పిల్లల్లో కరోనా సోకిన 6 వారాల తర్వాత ఈ కొత్త రోగం వ్యాపిస్తోందని తేలింది. పిల్లల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే... వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్... ప్రజలను కోరారు.

పిల్లల్లో కొత్త సిండ్రోమ్ లక్షణాలు :

- పిల్లలకు జ్వరం వస్తోంది.
- నీరసం వస్తోంది.
- ఆకలి వెయ్యట్లేదు.
- దురదలు వస్తున్నాయి.
- పెదవులు మరింత ఎర్రగా అవుతున్నాయి.- నోరు కూడా మరింత ఎర్రగా ఉంటోంది.

ముందుగానే గుర్తించడం ఎలా : ఇవీ ముందుగా కనిపించే లక్షణాలు...
- జ్వరం కంటిన్యూగా ఉంటుంది.
- దద్దుర్లు, దురదలు వస్తాయి.
- పొట్టలో నొప్పి వస్తుంది.
- వికారంగా ఉటుంది. వాంతులు వస్తాయి. విరేచనాలు అవుతాయి.
(కొంతమంది పిల్లలకు స్కిన్ కలర్ కూడా మారుతోంది)

ఈ ముందస్తు లక్షణాలు ఉన్న పిల్లల్ని ఎంత త్వరగా ఆస్పత్రికి తీసుకొస్తే, అంత మంచిదంటున్నారు డాక్టర్లు. ఇలాంటి పరిస్థితి వారం కిందటి వరకూ లేదనీ... ఇప్పుడు అమెరికా మొత్తం ఈ కొత్త కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు.


ప్రస్తుతం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)... ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి డేటా తెప్పించుకుంటోంది. చాలా రాష్ట్రాలు... కరోనా సోకిన 4 నుంచి 6 వారాల తర్వాతే ఈ కొత్త సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నాయి.


కొత్త సిండ్రోమ్ వల్ల పిల్లల ప్రాణాలు పోతుండటంతో దీనిపై అమెరికాలో కొత్త ఆందోళన మొదలైంది. పిల్లల పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో తిప్పలు పడుతుంటే... ఇప్పుడు ఇదేంటని ఆవేదన చెందుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోందని CDCని ప్రశ్నిస్తున్నారు. కానీ CDC దగ్గర దీనికి సమాధానం లేదు.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 7:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading