Home /News /coronavirus-latest-news /

CORONA UPDATE UNION FINANCE MINISTER NIRMALA SITHARAMAN TO ADDRESS THE MEDIA AT 4 PM TODAY NK

గుడ్ న్యూస్... ఆర్థిక ప్యాకేజీపై సాయంత్రం నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Corona Lockdown | Corona Update : భారతీయులూ రెడీగా ఉండండి. లాక్‌డౌన్ 4లో అమలయ్యే ఆర్థిక ప్యాకేజీలో తాయిలాల ప్రకటన రాబోతోంది.

    Corona Lockdown | Corona Update : సాయంత్రం 4 గంటలకు దేశం మొత్తం ఆసక్తిగా చూడక తప్పదు. ఎందుకంటే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయబోతున్నారు. రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నదీ చెప్పబోతున్నారు. అలాగే... దేశంలో అన్ని వర్గాల ప్రజలకూ ఆ రూ.20 లక్షల కోట్లతో ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో చెప్పబోతున్నారు. అంతేకాదు... పడకేసిన పారిశ్రామిక రంగాన్ని పైకి లేపడానికీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికీ నిర్మలమ్మ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే... పన్ను మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు బాగా వినిపిస్తున్న వేళ ఆమె ఏం చెప్పబోతున్నారన్నది ఇవాళ సాయంత్రం తేలబోతోంది.



    నిన్న తన ప్రసంగంలో ప్రధాని మోదీ... ఆర్థిక ప్యాకేజీపై త్వరలో ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారని అన్నారు. అందువల్ల చాలా మంది రేపో, ఎల్లుండో ఈ ప్రకటన ఉంటుంది అనుకున్నారు. కానీ నిర్మలమ్మ ఇవాళే ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు. నిజానికి ఈ ప్యాకేజీని కేంద్రం దాదాపు వారం నుంచి రెడీ చేస్తున్నట్లు తెలిసింది. మూడో లాక్‌డౌన్ సమయంలో ప్యాకేజీ ఉండాలని అనుకున్న కేంద్రం ఇంత భారీగా ఉండాలని మాత్రం అనుకోలేదనీ... కొన్ని వెసులు బాట్లు ఇస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఉందని తెలిసింది. కానీ... రాన్రానూ దేశ ఆర్థిక పరిస్థితి పతనం అవుతుండటం, రేటింగ్ సంస్థలు రేటింగ్‌ను పాతాళంలోకి నెట్టేస్తుంటే... కేంద్రం వెసులుబాట్లు, మినహాయింపులూ పెంచడమే కాకుండా... ప్యాకేజీ కూడా భారీగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లూ, ఆర్థిక వేత్తల సూచనలూ, వాస్తవ పరిస్థితులూ అన్నింటినీ లెక్కలోకి తీసుకొని కేంద్రం ఈ ప్యాకేజీని రూపొందించినట్లు తెలిసింది.

    ఈసారి ప్యాకేజీ విషయంలో ప్రధాని మోదీ... అత్యంత ఎక్కువ ఆసక్తి చూపించారు. ప్రధానంగా... దేశంలోని చిన్న, పెద్ద అన్ని వ్యాపార మండళ్లతో చర్చలు జరిపారు. రెండు వారాలుగా ఇవి సాగాయి. సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ ప్యాకేజీ రూపొందించారు. దేశంలోని చాలా సంస్థలు, వాణిజ్య చాంబర్లు తమ అభిప్రాయాలతో నివేదికలు అందించాయి.  అవన్నీ ప్రధాని మోదీ స్వయంగా దగ్గరుండి పరిశీలించి ఈ ప్యాకేజీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. మధ్య మధ్యలో చాలా రంగాల వారితో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించి మరీ ప్యాకేజీని ఫైనల్ చేశారని తెలిసింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Coronavirus, Covid-19, Nirmala sitharaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు