అమెరికాలో కరోనాతో లక్ష మంది చనిపోతారు... ట్రంప్ కామెంట్...

ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన ఎంతో చేశారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి పొందిన వారి కంటే మెరుగైన ప్రయత్నం చేశారని క్రిస్టీన్ చెప్పినట్టు ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

Corona Lockdown | Corona Update : శుభం పలకరా అంటే... ట్రంప్ అశుభాలు పలుకుతున్నారా? లేక వాస్తవాల్ని చెబుతున్నారా?

 • Share this:
  Corona Lockdown | Corona Update : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్... తన అసమర్థతను చాటుకుంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు సరైన చర్యలు తీసుకోవడం మానేసి... అమెరికన్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్నారు. ఏకంగా లక్ష మంది అమెరికన్లు చనిపోవచ్చంటూ... ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువవుతోంది. మరణాలు 68 వేలు దాటాయి. ట్రంప్ చెప్పిన అంచనా ప్రకారమైతే...... మరో 32 వేల మంది చనిపోతారు. ప్రస్తుతం అమెరికాలో రోజూ వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. ట్రంప్ ప్రకారమైతే... మే నెలాఖరుకు ఈ నంబర్ లక్షకు చేరుకుంటుంది.

  ట్రంప్ ప్రకారం... అమెరికాలో తొలి కరోనా నిరోధక వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. అంటే మరో 7 నెలల టైమ్ ఉంది. ఈ లోపు కరోనా ఎంత మందికి సోకుతుందో అంచనాకు అందట్లేదు. అమెరికాలో రోజూ 25 వేల మందికి పైగా కొత్తగా కరోనా బారిన పడుతున్నారు. అక్కడి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉంది. ప్రస్తుతం అక్కడ చాలా స్కూళ్లు, వ్యాపారాలూ మూతపడ్డాయి.

  ఓ న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్... ఎప్పట్లాగే... అమెరికా ఎకానమీ త్వరగా రికవరీ అవుతుందని అంటూనే... చైనాయే ఈ వైరస్‌ని వ్యాపింపజేసిందని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఎక్కువ మంది చనిపోవడం అనేది భయంకరమైన విషయమే అన్న ట్రంప్... లక్ష మంది కంటే తక్కువే చనిపోతే మంచిదే అన్నారు.

  ప్రస్తుతం అమెరికాలో దాదాపు సగం రాష్ట్రాలు నిబంధనల్ని సడలించాలని అనుకుంటున్నాయి. తద్వారా ఎకానమీ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నాయి. ట్రంప్ ఆలోచన కూడా ఇలాగే ఉంది. దేశం మొత్తాన్నీ మూసి ఉంచలేమని ఆయన అన్నారు., .

  ఓవైపు కరోనా తీవ్రంగా ఉంటే... ట్రంప్... ఆమధ్య అధ్యక్ష ఎన్నికల కోసం ర్యాలీలు చేసి... విమర్శల పాలయ్యారు. దాంతో... ఇప్పుడాయన టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ... తనను తాను సమర్థుడిగా చెప్పుకుంటున్నారు. ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ వచ్చేస్తే... అమెరికాలో కరోనా తొలగిపోతే... మళ్లీ తననే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిసింది.
  Published by:Krishna Kumar N
  First published: