ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ ఫైర్... నిధులు నిలిపివేత...

Corona Lockdown | Coronaupdate : అత్త మీద కోపం దుత్త మీద చూపించడమంటే ఇదే కావచ్చు.... తన దేశంలో కరోనాను హ్యాండిల్ చెయ్యలేక... ప్రపంచ ఆరోగ్య సంస్థపై విరుచుకుపడుతున్నారు ట్రంప్.

news18-telugu
Updated: April 15, 2020, 6:37 AM IST
ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ ఫైర్... నిధులు నిలిపివేత...
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పేర నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
  • Share this:
Corona Lockdown | Coronaupdate : అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటేయడంతో... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఓవైపు... తమ దేశంలో కరోనా కేసుల్లో నిలకడ వచ్చిందంటూనే... మరోవైపు కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సరిగా పనిచెయ్యలేదనీ... తమకు సరైన సమయంలో సరైన సూచనలు చెయ్యలేదనీ... మండిపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేస్తున్నామన్న ట్రంప్.. దీనిపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయాన్ని WHO దాచిపెట్టిందనీ, దాన్ని మహమ్మారిగా ప్రకటించే విషయంలో ఆలస్యం చేసిందని ట్రంప్ ఫైర్ అయ్యారు.

WHO ఏమీ చెయ్యలేకపోయినా... తాను మాత్రం కరోనాను బాగానే కంట్రోల్ చేస్తున్నానని గొప్పగా చెప్పుకున్నారు ట్రంప్. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయిగా అంటే... అదంతా మీడియా హడావుడేననీ, కేసుల్లో నిలకడ వచ్చేసిందని ట్రంప్ అన్నారు. అసలు ఇన్ని కేసులైనా రావడానికి WHO నిర్లక్ష్యమే కారణం అంటూ... తప్పును ఆ సంస్థపైకి నెట్టేశారు.

ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా.... 40 నుంచి 50 కోట్ల డాలర్లు (రూపాయల్లో... రూ.3040 కోట్ల నుంచి రూ.3800 కోట్లు) ఇస్తోంది. అదే సమయంలో చైనా ఇస్తున్నది దాదాపుగా రూ.300 కోట్లేనని ట్రంప్ అన్నారు. చైనాకు WHO మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌ని పంపి ఉంటే... చైనా... తమ దేశంలో వైరస్‌పై ఏమీ దాయకుండా చెప్పి ఉంటే... ఇన్ని మరణాలు జరిగేవే కాదని ట్రంప్ అన్నారు.

ట్రంప్ నిర్ణయంపై యాజ్‌యూజువల్‌గా విమర్శలు వస్తున్నాయి. వైరస్‌ని కంట్రోల్ చెయ్యడం చేతకాక... WHOని, చైనానీ విమర్శిస్తున్నారని ఫైర్ అవుతోంది ప్రతిపక్షం. ట్రంప్ త్వరగా మేలుకొని... దేశవ్యాప్త ఎమర్జెన్సీని త్వరగా ప్రకటించి ఉంటే... ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటోంది.
Published by: Krishna Kumar N
First published: April 15, 2020, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading