వామ్మో ఇదేం మాస్కు?... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు... వైరల్...

Corona Lockdown | Coronaupdate : డాక్టర్ హు (Doctor Who) సినిమాలో ఇలాంటిదే ఉంటుంది. అందువల్ల నెటిజన్లు ఇతన్ని డాక్టర్ హు అని పిలుస్తున్నారు.

news18-telugu
Updated: April 15, 2020, 2:53 PM IST
వామ్మో ఇదేం మాస్కు?... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు... వైరల్...
వామ్మో ఇదేం మాస్కు?... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు... (credit - www.reddit.com)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ఓ సూపర్‌మార్కెట్‌లో ఓ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి అది గ్యాస్ మాస్క్. అది అతని నోటి నుంచి బయటకు వచ్చినట్లు ఉంది. ఇలాంటి సీన్.. ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సినిమా డాక్టర్ హులో ఉంటుంది. అందుకే... చాలా మంది ఈ ఫొటో చూసి... డాక్టర్ హు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా ఉంది కాబట్టి... అందరూ మాస్కుల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. అందువల్ల ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించిన ఈ మాస్క్ ఫొటోని అంతా "ఏంటిది" అంటూ ఆసక్తిగా చూశారు, చూస్తున్నారు.

ఈ ఫొటోలో వ్యక్తి... స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్. అందువల్ల ఇలా ఆశ్చర్యంగా చూసేలా చేశాడు. దీనికి "ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్... స్వయంగా ఓ కరోనా మహమ్మారి మాస్క్ తయారుచేసుకున్నాడు" అంటూ ఈ ఫొటోకి కాప్షన్ ఉంది. ఐతే... కాస్త భయంకరంగా ఉన్న ఈ ఫొటోపై నెగెటివ్ కామెంట్స్ బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా డాక్టర్ హు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


A special effects artist made himself a mask for the pandemic and i can’t get over it from r/interestingasfuck


కరోనా వైరస్ వచ్చాక... చాలా మంది ఇలాంటి క్రియేటివ్ మాస్కులు తయారుచేసుకుంటున్నారు. రోజూ అందరిలా రొటీన్ మాస్కులు తొడుక్కుంటే... థ్రిల్ ఏముంది అనుకుంటూ.... కొంత మంది తమ బ్రెయిన్‌కి పదును పెడుతున్నారు.Published by: Krishna Kumar N
First published: April 15, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading