క్వారంటైన్ తర్వాత తిరిగి యజమానిని కలిసిన గాడిద... హార్ట్ టచింగ్ వీడియో...

Corona Lockdown | Corona Update : ప్రేమ విశ్వజనీనం. ఇన్నాళ్లూ తన యజమానిని మిస్సైన ఆ గాడిద... ఇప్పుడు తిరిగి అతన్ని కలిసి... ఎంతో ఆనందపడింది.

news18-telugu
Updated: May 23, 2020, 11:51 AM IST
క్వారంటైన్ తర్వాత తిరిగి యజమానిని కలిసిన గాడిద... హార్ట్ టచింగ్ వీడియో...
క్వారంటైన్ తర్వాత తిరిగి యజమానిని కలిసిన గాడిద... హార్ట్ టచింగ్ వీడియో... (credit - youtube)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆప్యాయత, అనురాగాలతో కూడిన కొన్ని కొన్ని వీడియోలు మనల్ని కన్నీరు పెట్టిస్తాయి. ఇది అలాంటిదే. కరోనా లాక్‌డౌన్ కారణంగా... ఆ గాడిద యజమాని సడెన్‌గా ఇంటికే పరిమితం అయ్యాడు. అధికారులు అతన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని క్వారంటైన్ చేశారు. దాంతో తిరిగి గాడిదను చేరలేకపోయాడు. ఆ గాడిద ఏమైపోయిందో అతనికి తెలియదు. అతను ఏమయ్యాడో దానికి తెలీదు. ఇలా... రెండు వారాలు గడిచిపోయాయి. కరోనా లేదని తేలింది. దాంతో అతన్ని వదిలేసారు. తిరిగి తన గాడిదను చూసేందుకు... పొలాలవైపు వెళ్లాడు.

అతని మాటలు వినగానే... గాడిద వేగంగా వచ్చింది. తన యజమానిని కలిసి... అతనిపై దానికి ఉన్న ఎఫెక్షన్‌ను చాటుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొదట ఈ వీడియో చూసిన వాళ్లు ఇందులో ఏముంది ప్రత్యేకత... అనుకుంటూ... తీరా గాడిద వచ్చి ఓనర్‌ను కలిసిన తర్వాత కన్నీరు పెడుతున్నారు. నాల్రోజుల కిందట అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 7న్నర లక్షల మంది చూశారు. 5 వేల మందికి పైగా లైక్ చేశారు.


చాలా మంది ఈ వీడియో చూసి ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు. చాలా మంది గాడిదల్ని చిన్న చూపు చూస్తారనీ... వాటికీ తెలివితేటలు ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు కొందరు.
Published by: Krishna Kumar N
First published: May 23, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading