కరోనా వైరస్‌కి చైనా బాధ్యత వహించాల్సిందే... ట్రంప్ సీరియస్ వార్నింగ్...

Corona Lockdown | Corona Update : చైనా నుంచి పరిహారం రాబట్టే దిశగా ట్రంప్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 28, 2020, 7:29 AM IST
కరోనా వైరస్‌కి చైనా బాధ్యత వహించాల్సిందే... ట్రంప్ సీరియస్ వార్నింగ్...
కరోనా కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని.. ఈ సమయంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడాల్సిన అవసరంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. దీని వల్ల అనేక మంది విదేశీయులు తీవ్రంగా నష్టపోతున్నారు.
  • Share this:
Corona Lockdown | Corona Update : అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షలు దాటేయడంతో... ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... చైనాపై మరింత ఘాటు విమర్శలు చేశారు. కరోనా వైరస్ చైనా వల్లే వచ్చిందనేది నిరూపించేందుకు... వెరీ సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందన్న ట్రంప్... తమ ప్రభుత్వం... చైనా నుంచి భారీ ఎత్తున డబ్బును పరిహారంగా రాబట్టే అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆల్రెడీ జర్మనీ... 130 బిలియన్ యూరోలు (రూ.10,72,030 కోట్లు) డిమాండ్ చేస్తోందన్న ఆయన... తాము అంతకంటే ఎక్కువ పరిహారం అడిగే దిశగా లెక్కలు వేస్తున్నామన్నారు.

జరిగే పరిస్థితుల్ని జర్మనీ పరిశీలిస్తోందన్న ట్రంప్... తాము కూడా జరిగే పరిణామాల్ని లెక్కలోకి తీసుకుంటున్నామని అన్నారు. సోమవారం వైట్‌హౌస్ దగ్గర రిపోర్టర్లతో మాట్లాడుతూ ట్రంప్... చైనాపై మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణం అని నిరూపించేందుకు చాలా మార్గాలు ఉన్నాయన్న ట్రంప్... చైనాను బాధ్యురాలిగా చేస్తామన్నా్రు. "మేం వెరీ సీరియస్‌గా దర్యాప్తు జరిపిస్తున్నాం.... ఆ సంగతి మీకూ తెలుసు" అన్న ట్రంప్... "చైనా వల్ల మేం సంతోషంగా లేము" అని కామెంట్ చేశారు.

ఇంతకు ముందు ఓ భారతీయ లాయర్ కూడా అంతర్జాతీయ కోర్టులో చైనాపై దావా వేశారు. చైనా భారత్‌కి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా మున్ముందు మరిన్ని దేశాలు చైనాని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ని చైనాయే సృష్టించిందని అమెరికా నిరూపించగలిగితే... ఆ దేశంపై ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించే అవకాశాలు ఉంటాయి. ఐతే... అసలా వైరస్ ఎలా పుట్టిందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోతున్నారు. రెండు వేర్వేరు జాతుల వైరస్‌ల వల్ల ఈ కొత్త వైరస్ పుట్టిందనే అభిప్రాయం ఉంది. ఈ మొత్తం మేటర్‌పై అమెరికా పరిశోధకులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading